Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పదేళ్లుగా భారత్‌, దక్షిణాసియా దేశాలపై చైనా గూఢచర్యం

న్యూఢిల్లీ: చైనా ప్రభుత్వం పదేళ్లుగా భారత ప్రభుత్వ రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందా? అంటే నిజమేనని పేర్కొంటోంది ఫైర్‌ ఐ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ. ఏపిటి 30 అనే సంస్థ ద్వారా చైనా ప్రభుత్వం కీలకమైన భారత వైమానిక, రక్షణ రంగాలతోపాటు పలు ప్రభుత్వరంగ సంస్థలపై నిఘా ఉంచిందని ఫైర్‌ ఐ ఓ నివేదికలో వెల్లడించింది.

ఆయా ప్రభుత్వరంగ సంస్థల కంప్యూటర్లలోకి చొరబడటం ద్వారా ఏపీటీ 30 కీలకమైన సమాచారాన్ని సేకరించి చైనాకు అందజేస్తోందని పేర్కొంది. భారత్ తోపాటు పలు ఆసియా దేశాలపైనా చైనా పదేళ్లుగా గూఢచర్యం జరుపుతున్నట్లు తెలిపింది.

Chinese hackers have successfully spied on Southeast Asia and India for 10 years

భారత్, దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్, వియత్నాం, మలేషియా, నేపాల్, సింగపూర్, ఇండోనేషియా లాంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని గూఢచర్యం సాగించినట్లు వెల్లడించింది.

ఇది ఇలా ఉండగా, నిఘా ఆరోపణలను చైనా ఖండించింది. భారత్‌తో సహా ఆసియాన్‌ దేశాలపై చైనా ఎలాంటి నిఘా కార్యకలాపాలకు పాల్పడటం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారప్రతినిధి ప్రకటించారు. కాగా, తమ దేశంపై గూఢచర్యం చేస్తున్న ఉపగ్రహాలను కనుగొన్నామని రష్యా ప్రకటించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+