వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా దుర్నీతి: తొలి బాంబు ఉత్తరకొరియా వేస్తే ఓకే.. అమెరికా వేస్తే మాత్రం...

చైనా తన దుర్నీతిని బయటపెట్టుకుంది. ఉత్తరకొరియా, అమెరికాపై తొలి దాడి జరిపితే, తాము కల్పించుకోరాదని, అదే అమెరికా, దక్షిణ కొరియా కలిసి ఉత్తరకొరియాపై గనుక దాడికి దిగితే అడ్డుకోవాలని చైనా భావిస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనా తన దుర్నీతిని మరోసారి బయటపెట్టుకుంది. ఉత్తరకొరియా, అమెరికాపై తొలి దాడి జరిపితే, తాము కల్పించుకోరాదని, అదే అమెరికా, దక్షిణ కొరియా కలిసి ఉత్తరకొరియాపై గనుక దాడికి దిగితే అడ్డుకోవాలని చైనా భావిస్తోంది.

ఈ విషయాన్ని చైనా అధికార దినపత్రిక 'గ్లోబల్ టైమ్స్' శుక్రవారం నాటి సంచికలో ప్రధానంగా ప్రచురించింది. అమెరికాపై ఉత్తర కొరియా అణు క్షిపణులు వేస్తే, చైనా మధ్యస్థంగానే ఉండాల్సిన అవసరం ఉందని ఆ పత్రిక పేర్కొంది.

ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో...

ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పై కటువు వ్యాఖ్యలు చేసిన వేళ, చైనా ఈ తరహా కథనాన్ని ప్రచురించడం గమనార్హం. ఉత్తరకొరియాకు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా, నమ్మకమైన మిత్రుడిగా చైనా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఆ పని మేం చేయలేం...

ఆ పని మేం చేయలేం...

వరుసగా క్షిపణి పరీక్షలు జరుపుతూ రెచ్చిపోతున్న ఉత్తరకొరియాను అదుపులో పెట్టేందుకు చైనా సహకరించాలని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కోరారు. అయితే, ఈ విషయంలో కూడా చైనా మొండిచేయే చూపించింది. ఉత్తరకొరియా అధినేత కిమ్ ను తాము అదుపు చేయలేమని, ఇదే సమయంలో పూర్తిగా స్నేహబంధాన్నీ తెంచుకోలేమని అది స్పష్టం చేసింది.

కల్పించుకోమంటూనే...

కల్పించుకోమంటూనే...

ఇక ఉత్తర కొరియా వద్ద ఉన్న ఆధునిక ఆయుధాల్లో కొన్ని చైనా ఇచ్చినవే. వాటిని చైనాయే ఆ దేశానికి విక్రయించింది కూడా. అయితే తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో తాము కల్పించుకోరాదని చైనా భావిస్తోంది. ఒకవేళ అమెరికా, దక్షిణ కొరియా కలిసి ఉత్తర కొరియాను పూర్తిగా ధ్వంసం చేయాలని భావిస్తే మాత్రం చైనా అడ్డుపడేలాగే ఉంది.

అవే ప్రపంచానికి పెనుభూతం...

అవే ప్రపంచానికి పెనుభూతం...

అణ్వాయుధాలు ప్రపంచానికి పెనుభూతంగా మారాయన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. అసలు ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు అనేవి లేకుండా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా భూభాగంపై అణుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఉత్తరకొరియా రెచ్చగొడుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

గ్లోబల్ వార్మింగ్ కన్నా...

గ్లోబల్ వార్మింగ్ కన్నా...

ప్రస్తుతం సెలవులపై న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్‌లో ఉన్న ట్రంప్‌.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘గ్లోబల్‌ వార్మింగ్‌(వాతావరణంలో పెరుగుతున్న వేడి) ప్రపంచానికి పెను ముప్పుగా ఉందని మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు కానీ దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. గ్లోబల్‌ వార్మింగ్‌ చాలా చిన్నది. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు అణు శక్తి పెనుభూతంగా మారింది. అందుకే నేను అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని కోరుకుంటున్నాను. అణ్వాయుధాలు కలిగి ఉన్న రష్యా, అమెరికా, చైనా, పాకిస్తాన్, మిగతా దేశాలు వాటిని వదిలేయాలి' అని ట్రంప్‌ అన్నారు.

మంచి కోసం ఉపయోగించాలి..

మంచి కోసం ఉపయోగించాలి..

అయితే అణు రహిత ప్రపంచం సాధించేవరకు.. అమెరికానే అణుశక్తి ఉన్న పెద్ద దేశంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. అయితే అణ్వాయుధాలను మంచి కోసమే ఉపయోగించాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరకొరియా హెచ్చరికలపై కూడా ట్రంప్‌ స్పందించారు. ఉత్తరకొరియాకు సమాధానం చెప్పేందుకు తమ మిలిటరీ శక్తిని పెంచుకున్నట్లు తెలిపారు. దీనికోసం బిలియన్‌ డాలర్లు ఖర్చుచేస్తున్నామన్నారు.

English summary
If North Korea launches an attack that threatens the United States then China should stay neutral, but if the United States attacks first and tries to overthrow North Korea's government China will stop them, a Chinese state-run newspaper said on Friday.President Donald Trump ratcheted up his rhetoric toward North Korea and its leader on Thursday, warning Pyongyang against attacking Guam or U.S. allies after it disclosed plans to fire missiles over Japan to land near the U.S. Pacific territory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X