వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్1బీ-ట్రంప్ 'కంప్యూటర్ ప్రోగ్రామర్' దెబ్బ: ఈ ప్రభావం ఎంత?

సాధారణ కంప్యూటర్ ప్రోగ్రామర్‌ను ఇకపై ప్రత్యేక వృత్తిదారుడిగా పరిగణించబోమని అమెరికా తేల్చి చెప్పింది. అమెరికా హెచ్1బి వీసా కావాలంటే వృత్తి నిపుణుడై ఉండాలి.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సాధారణ కంప్యూటర్ ప్రోగ్రామర్‌ను ఇకపై ప్రత్యేక వృత్తిదారుడిగా పరిగణించబోమని అమెరికా తేల్చి చెప్పింది. అమెరికా హెచ్1బి వీసా కావాలంటే వృత్తి నిపుణుడై ఉండాలి. అమెరికా తాజా నిర్ణయం దశాబ్దాలుగా ఉన్న సగానికి పైగా మార్గదర్శకాలను మార్చివేయనుంది.

ఎంట్రీ లెవల్ కంప్యూటర్ ప్రోగ్రామర్ ప్రత్యేక వృత్తి నిపుణుడు కాదంటూ అమెరికా పౌరసత్వం, వలస సేవలు (యూఎస్‌సిఐఎస్) తీర్మానం చేసింది. ఈ తాజా నిర్ణయం తదుపరి ఆర్థిక సంవత్సరంలో హెచ్1బి వర్క్ వీసాలు ఆశిస్తున్న వేలాదిమంది భారతీయులపై పడనుంది.

నాటి మార్గదర్శకాలకు విరుద్దం

నాటి మార్గదర్శకాలకు విరుద్దం

హెచ్‌1బీ వర్క్‌ వీసాల కోసం దరఖాస్తు చేసే వేల మంది భారతీయులపై ప్రభావాన్ని చూపగల ఈ కీలక నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఇకపై ప్రవేశస్థాయి (ఎంట్రీ లెవల్‌) కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ను ప్రత్యేక వృత్తినిపుణుడిగా పరిగణించబోమని ప్రకటించింది. సైన్స్‌, ఐటీ లాంటి అంశాల్లో అత్యుత్తమ నైపుణ్యాలతో ముడిపడిన వృత్తుల్లో అమెరికాలోని కంపెనీలు విదేశీయులను తాత్కాలికంగా నియమించుకునేందుకు హెచ్‌1బీ వీసా విధానం వీలు కల్పిస్తుంది. ఈ వీసా పొందాలంటే ఇలాంటి ప్రత్యేక వృత్తుల్లో నిపుణులై ఉండాలి. 2000 డిసెంబరులో అమెరికా జారీ చేసిన మార్గదర్శకాలకు తాజా నిర్ణయం విరుద్ధమైనది.

ఆందోళనకరం

ఆందోళనకరం

ప్రత్యేక వృత్తి (స్పెషాలిటీ ఆక్యుపేషన్‌)పై స్పష్టతనిస్తూ వాటి స్థానంలో మార్చి 31న కొత్త మార్గదర్శకాలతో విధానపత్రం విడుదలైంది. అక్టోబరు 1తో మొదలయ్యే కొత్త సంవత్సరానికి సంబంధించి హెచ్‌1బీ వీసాల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ సోమవారం మొదలు అయ్యాయి. దీనికి మూడు రోజుల ముందు అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం దీనిని విడుదల చేసింది. పాత మార్గదర్శకాల ప్రాతిపదికగా హెచ్‌1బీ వీసాల కోసం ప్రయత్నిస్తున్న ఐటీ కంపెనీల్లో ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఇతర ఆధారం చూపించాలి

ఇతర ఆధారం చూపించాలి

ఏదైనా సంస్థలో ఒక కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ ఐటీలో తన పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను వినియోగిస్తూ సంస్థ లక్ష్యాలను అధిగమించడంలో తన వంతు పాత్ర పోషిస్తుండవచ్చనని, అంతమాత్రాన వారి ఉద్యోగం ప్రత్యేక వృత్తి కిందకు రాదని, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ ప్రత్యేక వృత్తి అని చెప్పే ఇతర ఆధారాన్ని దరఖాస్తుదారు చూపించాలని ఈ పత్రం పేర్కొంటోంది.

ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిక

ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిక

హెచ్‌1బీ వీసాల దుర్వినియోగంపై అమెరికాలోని కంపెనీలను ట్రంప్‌ ప్రభుత్వం హెచ్చరించింది. వీటిని దుర్వినియోగం చేస్తే సహించబోమని చెప్పింది. వీటి దుర్వినియోగం ద్వారా అమెరికన్లపై వివక్ష చూపొద్దని న్యాయశాఖలోని పౌరహక్కుల విభాగం తాత్కాలిక సహాయ అటార్నీ జనరల్‌ టామ్‌ వీలర్‌ చెప్పారు.

చట్టాన్ని ఉల్లంఘించినట్లు తమ దృష్టికి వస్తే దర్యాప్తు జరుపుతామని, బాధ్యులను ప్రాసిక్యూట్‌ చేస్తామని న్యాయశాఖ స్పష్టం చేసింది. ఉద్యోగాల్లో వివక్ష బారిన పడకుండా అమెరికన్లను కాపాడే చట్టాలను అమలు చేస్తామని వైట్‌హౌస్‌ తెలిపింది.

తాజా నిబంధనల ప్రకారం.. ప్రభావం ఎంత?

తాజా నిబంధనల ప్రకారం.. ప్రభావం ఎంత?

తాజా నిబంధనల ప్రకారం కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ అంటే కేవలం కంప్యూటర్‌ సంబంధిత అంశాల్లో ప్రవేశ ఉద్యోగాలు మాత్రమే. అయితే వీరికి మరిన్ని అదనపు అర్హతలు కావాల్సి ఉంది. ముఖ్యంగా కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌కు సంబంధించి అదనపు పరిజ్ఞానం అవసరం.

ఉద్యోగాలు కల్పించే యజమాని ఆ ఉద్యోగం ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉన్నాదా లేదా అన్న అంశంపై మరిన్ని ఆధారాలు చూపాల్సి ఉంటుంది.

ప్రతి ఏడాది హెచ్‌-1 బి వీసాల కోసం వేలాది దరఖాస్తులు అందుతుంటాయి. లాటరీ విధానం ద్వారా 65 వేలమందిని ఎంపిక చేస్తారు. అయితే కొత్త నిబంధనలతో దరఖాస్తుల వడపోత ఎక్కువగా ఉంటుందని ఇమ్మిగ్రేషన్‌ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం రెండు సంవత్సరాల డిగ్రీతో కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్నన వారిపై ప్రభావం పడే అవకాశం.

నిబంధనల ప్రకారం.. ప్రభావం ఎంత?

నిబంధనల ప్రకారం.. ప్రభావం ఎంత?

కంపెనీలు తమ వ్యయ నియంత్రణలో భాగంగా ఇతర దేశాల నుంచి ఎంట్రీలెవల్‌ ఉద్యోగులను తీసుకుంటాయి. స్థానిక అమెరికన్లతో పోలిస్తే వీరికి తక్కువ వేతనాలు ఇస్తారు. దీంతో కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది. అయితే తాజా నిబంధనలతో కంపెనీలు స్థానిక యువతకు వేతనాల రూపంలో భారీగా నష్టపోవాల్స ఉంటుంది.

భారత్‌ వరకు వస్తే పలు భారత కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను అమెరికాకు పంపిస్తుంటాయి. ఈ నిబంధనల ప్రకారం ఈ కంపెనీలకు చెందిన కంప్యూటర్‌ నిపుణులు ఎక్కువ వేతనాలు డిమాండ్‌ చేసే అవకాశముంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

వీసాలకు సంబంధించి గతంలో ఉన్న నిబంధనలకు కాలం చెల్లింది. కంప్యూటర్ ప్రోగ్రామర్ అంటే కేవలం కంప్యూటర్ సంబంధిత అంశాల్లో ప్రవేశ ఉద్యోగాలు మాత్రమే. అయితే వీరికి మరిన్ని అదనపు అర్హతలు ఉండాలి. యాజమాన్యం ఆధారాలు చూపించాలి.

English summary
US Citizenship and Immigration Services quietly over the weekend released new guidance that computer programmers are no longer presumed to be eligible for H-1B visas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X