వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉబెర్ క్యాబ్ సర్వీస్‌పై యుఎస్ కోర్టులో దావా: ఢిల్లీ బాధితురాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఆన్‌లైన్ కారు సర్వీస్ సంస్ధ 'ఉబెర్' పై న్యూఢిల్లీకి చెందిన ఉబెర్ బాధితురాలు గురువారం అమెరికాలోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ప్రయాణీకులకు తగిన భద్రతా విధానాలు కల్పించడంలో ఆ సంస్ధ విఫమైందంటూ తన దావాలో ఆరోపించారు.

ఈ దావాలో ఫైనాన్సియల్ ఎగ్జిక్యూటివ్ పేరుని ప్రస్తావించలేదు. అమెరికా తర్వాత భారత్‌లోనే ఉబెర్ ఎక్కువ పట్టణాల్లో తన సర్వీసులను అందిస్తుంది. భారత్‌లో ఉబెర్ టాక్సీ సంస్ధ ఏడాదికి సుమారు 6 నుంచి 9 బిలియన్ల డాలర్లు వ్యాపారం చేస్తుంది.

 Delhi rape victim sues Uber in US court

ఐతే ఈ దావాపై ఉబెర్ ప్రతినిధులు మాత్రం స్పదించ లేదు. న్యూఢిల్లీలో ఓ మహిళా ఉద్యోగిపై ఉబెర్ టాక్సీ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉబెర్ క్యాబ్ సర్వీసులను దేశ వ్యాప్తంగా నిషేధించింది. ఆ సంస్ధపై నిషేధం విధించాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.

English summary
A passenger allegedly raped by an Uber driver in New Delhi sued the online car service in U.S. federal court on Thursday, claiming the company failed to maintain basic safety procedures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X