వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డోక్లామ్‌తో పాటు కాలాపానీలో జోక్యం చేసుకొంటే ఏం చేస్తారు: చైనా

డోక్లామ్: సిక్కిం రాష్ట్ర సరిహద్దులో ఉన్న డొక్లామ్‌లోని ట్రై జంక్షన్ వద్ద తమ దేశ సైన్యానికి ఎదురు నిలుస్తున్న భారత సైన్యం.... తాము రూట్ మార్చి కాశ్మీర్, ఉత్తరాఖండ్‌లోని కాలాపానీలపై జోక్యం చేసుకొంటే

By Narsimha
|
Google Oneindia TeluguNews

డోక్లామ్: సిక్కిం రాష్ట్ర సరిహద్దులో ఉన్న డొక్లామ్‌లోని ట్రై జంక్షన్ వద్ద తమ దేశ సైన్యానికి ఎదురు నిలుస్తున్న భారత సైన్యం.... తాము రూట్ మార్చి కాశ్మీర్, ఉత్తరాఖండ్‌లోని కాలాపానీలపై జోక్యం చేసుకొంటే ఏం చేస్తోందని చైనా విదేశాంగా శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వాంగ్ వెన్షీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

డొక్లామ్ సరిహద్దులోని ఒక్క భారత్ సైనికుడు ఉన్న దాన్ని చైనా సహించబోదన్నారు. చైనా దినపత్రికలు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. డొక్లామ్‌లో భారత్ తన సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని ఆమె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Doklam row: What if we enter Kalapani in Uttarakhand or Kashmir? China to India

భారత్‌తో చర్చలు జరిపే ప్రసక్తేలేదన్నారామె. డోక్లామ్ సరిహద్దులో ఒక్క సైనికుడు ఉన్నా చైనా సహించబోదని ఆమె చెప్పారు. అయితే ఈ సమావేశంలో ఇండియాకు చెందిన ప్రతినిధులు కూడ ఉన్నారు.

భారత్‌తో చర్చలు జరిపితే దేశప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోతోందన్నారామె. కాశ్మీర్, భారత్-నేపాల్‌ల మధ్య ఉన్న కాలాపానీ సమస్యలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కోడి మెడ పేరుతో డోక్లామ్‌లో చైనాకు భారత్ అడ్డుపడుతోందని ఆమె అన్నారు. భారత్‌ను కూడ పొరుగుదేశాలతో ట్రై జంక్షన్ సమస్యలున్నాయని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. కాలాపానీ, కాశ్మీర్ సమస్యల్లోకి చైనా ప్రవేశిస్తే భారత్ ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు.

చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌టైమ్స్ కూడ ఇదే విషయాన్ని ప్రకటించింది.

English summary
Doklam row: What if we enter Kalapani in Uttarakhand or Kashmir? China to India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X