వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలిసారి ముఖాముఖి: బిగ్ డిబేట్‌లో హిల్లరీపై ట్రంప్ నిప్పులు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ సోమవారం(భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం) జరిగింది. న్యూయార్క్‌లోని హోఫ్‌స్ట్రా యూనివర్సిటీ హాల్‌లో జరిగిన ఈ బిగ్ డిబేట్‌లో అమెరికా దశదిశ, ప్రజల భద్రత, శ్రేయస్సు అనే అంశాలపై చర్చ జరిగింది.

90 నిమిషాలపాటు జరిగిన ఈ వాడివేడి ముఖాముఖి చర్చాకార్యక్రమంలో ఒకరిని మించి ఒకరు సమాధానం ఇచ్చారు. ఒక్కో ప్రశ్నకు రెండు నిమిషాల సమయం ఇవ్వగా చాలా స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పారు. ఎన్బీసీ న్యూస్ ఈ కార్యక్రమానికి మధ్యవర్తిగా ఉన్నారు.

వేదికపైకి రాగానే తొలుత హిల్లరీనే ట్రంప్‌ను పలకరించారు. ఎలా ఉన్నారు? మిస్టర్ ట్రంప్ అంటూ ఆమె ప్రశ్నించారు. ఆ సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్నవారంతా గట్టిగా కేకలు వేశారు. డిబేట్లో తొలి అంశం అమెరికా ప్రజల శ్రేయస్సు అనే అంశంపైనే మొదలవ్వగా అందులో తొలి ప్రశ్నగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఏం చేయాలి? అమెరికన్ల జేబుల్లోకి తిరిగి ఆదాయం ఎలా తీసుకొస్తారని, ఉద్యోగాలను ఎలా సృష్టిస్తారని ప్రశ్నించారు.

 హిల్లరీవి మాటలే కానీ చేతలు కాదు

హిల్లరీవి మాటలే కానీ చేతలు కాదు

బిగ్ డిబేట్‌లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వలసలను ప్రదానంగా ప్రస్తావించారు. తాను డిబేట్ కోసం సిద్ధమవ్వలేదని అధ్యక్ష పదవి కోసం సిద్ధమయ్యానని చెప్పారు. హిల్లరీవి మాటలే కానీ చేతలు కాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల పెద్ద ఎత్తున కంపెనీలు ఇతర దేశాలకు తరలిపోతున్నాయన్నారు. దాని వల్ల ఆర్ధిక వ్వవస్థ కుదేలవుతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే కంపెనీలకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలన్నారు.

 హిల్లరీ ఈ మెయిల్స్‌ను బయట పెట్టగలరా?

హిల్లరీ ఈ మెయిల్స్‌ను బయట పెట్టగలరా?


హిల్లరీకి ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. హిల్లరీ ట్యాక్స్ విధానాలు దేశానికి నష్టమన్నారు. నా ట్యాక్స్ వివరాలను భయటపెట్టేందుకు సిద్ధమన్నారు. తాను వందలు, వేలు ఉద్యోగాలు సృష్టించానన్నారు. పోలీసులుపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. 30 ఏళ్ల నుంచి హిల్లరీ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. హిల్లరీ ఈ మెయిల్స్‌ను బయట పెట్టగలరా? అని ప్రశ్నించారు. హిల్లరీ 30వేల ఈ మెయిల్స్ డిలీట్ చేసిందని చెప్పారు. 30 ఏళ్లుగా హిల్లరీ ఇదే మాటలు చెబుతున్నారన్నారు.

 ఆఫ్రో అమెరికన్లు భయంతో ఉన్నారు

ఆఫ్రో అమెరికన్లు భయంతో ఉన్నారు

ఆఫ్రికన్ అమెరికన్లు భయంతో ఉన్నారన్నారు. చికాగోలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ఒబామా అధ్యక్షుడు అయ్యాక నాలుగు వేల మందిని చంపేశారన్నారు. ఐసిస్ మీద ఒబామా యుద్ధం చేయలేకపోయారన్నారు. అమెరికాలో అప్రో అప్రికన్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఐదుగురు పోలీసులను చంపేశారన్నారు. దేశంలో లా అండ్ ఆర్డర్ ను ఖచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. రాజకీయ నాయకులు చెప్పేదొకటి, చేసేదొకటి అని అన్నారు. తాను ఉద్యోగాలు వెనక్కి తీసుకురాగలగనని, హిల్లరీ అలా చేయలేదని చెప్పారు.

ట్రంప్ తనను నమ్మి పెట్టుబడులు పెట్టినవారిని మోసం చేశారని, పలు కంపెనీలు ఆయన వల్ల దెబ్బతిన్నాయని అన్నారు. ఎంతోమందిని తాను కలిశానని వారంతా ట్రంప్ ద్వారా ఎలా మోసపోయారో చెప్పారని అన్నారు. దీనికి బదులిచ్చిన ట్రంప్ పని సంతృప్తి ఇవ్వనప్పుడు చెల్లింపుల్లో కోతలు సాధారణంగా విధిస్తుంటామని అన్నారు.

 కమాండ్ ఇన్ ఛీప్‌గా ట్రంప్ పనికిరారు

కమాండ్ ఇన్ ఛీప్‌గా ట్రంప్ పనికిరారు

డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తాను అధ్యక్ష పదవికి సిద్ధమయ్యా అందుకే డిబేట్‌కు సిద్ధమయ్యానని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ రాబోయే అధ్యక్షుడికి పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. రష్యా మనదేశంలో పెద్ద ఎత్తున సైబర్ దాడులకు పాల్పడుతోందన్నారు. రష్యా మన శక్తిని గుర్తించాలన్నారు. కమాండ్ ఇన్ ఛీప్‌గా ట్రంప్ పనికిరారని పేర్కొన్నారు. అమెరికాలో దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామన్నారు.

 కార్పోరేట్ లొసుగులు తొలగిస్తాం

కార్పోరేట్ లొసుగులు తొలగిస్తాం

ట్రంప్ విధానాలు హ్యాకింగ్ ను ప్రోత్సహించే విధంగా ఉన్నాయన్నారు. అందరికీ తుపాకులు అందుబాటులో ఉండటం ప్రమాదకరమే అని అన్నారు. తన ఈమెయిల్స్ పొరపాటును డిలీట్ అయ్యాయని పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనకు ఎన్నో మార్గాలున్నాయన్నారు. అమెరికాలో పెద్ద ఎత్తున కంపెనీల స్థాపనకు కార్పోరేట్ లొసుగులు తొలగిస్తామన్నారు. చైనా, మెక్సికో, ఇండియా లాంటి దేశాలు ఉద్యోగాలు కొల్లగొడుతున్నాయన్నారు. మధ్య తరగతిపై మన ఖర్చు పెరగాలని సూచించారు. హిల్లరీ తాను కనీసం ఐసిస్ పై పోరాటం చేస్తానని ప్రకటించానని చెప్పగా.. ట్రంప్ మాత్రం ఇస్లామిక్ స్టేట్ కు ప్రధాన ఆదాయ వనరు ఇంధనమేనని, దానిని తీసుకుంటే ఐసిస్ అనేది ఉండనే ఉండదని ట్రంప్ అన్నారు.

 అమెరికా చట్టాలను ప్రతిఒక్కరూ గౌరవించాల్సిందే

అమెరికా చట్టాలను ప్రతిఒక్కరూ గౌరవించాల్సిందే

నిర్మాణ రంగం, టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇలా అనేక రంగాలున్నాయన్నారు. రష్యా ప్రభుత్వ, ప్రైవేట్ పైళ్లను హ్యాక్ చేస్తున్నాయన్నారు. అమెరికా చట్టాలను ప్రతిఒక్కరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. సామాన్యులు, మధ్యతరగతి వారికి లభ్ధి చేకూరుస్తున్నామన్నారు. పోలీసులు, కమిటీల మధ్య సయోధ్య కుదర్చాలని అన్నారు. అణ్వయుధాలపై ట్రంప్‌కి అవగాహన లేదని అన్నారు. ఐసిస్‌ను సమూలంగా నాశనం చేసేందుకు మధ్య ఆసియా, యూరప్ దేశాలతో కలిసి పోరాడుతున్నామన్నారు.

చివరిగా అమెరికాకు పూర్వం ఉన్న వైభవాన్ని తీసుకురావడమే తన లక్ష్యం అని ట్రంప్ చెప్పగా మొత్తం అమెరికన్ల సహాయంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం తన ఆశయం అని హిల్లరీ చెప్పింది.

English summary
First presidential debate in which Hillary Clinton and Donald Trump face off for the first time onstage. The debate is expected to have a large viewership, with an estimated 100 million potentially tuning in as the pair tackle issues like "America's Direction," "Achieving Prosperity' and "Securing America" on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X