వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ‘కంపు’ ప్రవర్తన.. ఏంజెలాకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తొలి సమావేశం మోటుగా మొదలై గందరగోళంగా ముగిసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తొలి సమావేశం మోటుగా మొదలై గందరగోళంగా ముగిసింది. ఈ సంయుక్త సమావేశం సందర్భంగా వాణిజ్యం, రష్యా, ఇమ్మిగ్రేషన్, వైర్ ట్యాపింగ్ తదితర అంశాలు కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించాయి.

తమ మధ్య ఉన్న విభేదాలను దాచిపెట్టేందుకు ఇద్దరూ చాలా కష్టపడాల్సి వచ్చింది. సుదీర్ఘకాలంగా ఐరోపాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్తకు సారథ్యం వహిస్తున్న ఏంజెలా మెర్కెల్, అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఇదే తొలిసమావేశం కావడంతో.. ఇరు దేశాల మధ్య భవిష్యత్ సంబంధాలను నిర్ణయించే సమావేశంగా అందరూ భావించారు.

అయితే ఓ వైపు మెర్కెల్ కాస్త ప్రశాంతంగానే కనిపించినప్పటికీ.. ఇద్దరి మధ్య హావభావాలు మాత్రం అంత సహృద్భావంగా కనిపించలేదు. వైట్ హౌస్ కి వచ్చినప్పుడు మాత్రం మెర్కెల్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన ట్రంప్.. ఓవల్ ఆఫీసులో మాత్రం చుక్కలు చూపించారు.

Donald Trump refuses to shake Angela Merkel's hand

ట్రంప్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఏంజెలా మెర్కెల్ ఎన్నిసార్లు దగ్గరదగ్గరికి వంగినా ఆయన నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. నిటారుగా కాళ్లపై కూర్చుని, రెండు చేతులూ జోడించి కాళ్లపై పెట్టుకుని కిందికి చూస్తూ కూర్చున్నారు.

ట్రంప్ ప్రవర్తనతో మెర్కెల్ ముఖంలో నవ్వులు కాస్తా మాయమయ్యాయి. మీడియా ప్రతినిధులు అడిగినా ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఆమె ఒకింత ఇబ్బందికి గురయ్యారు. చివరికి మీడియా సమావేశం ముగిసిన తరువాత ఆయన మెర్కెల్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఓ దేశ నాయకురాలిని తొలి సమావేశంలోనే ఈ విధంగా అవమానించిన ట్రంప్ పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

English summary
Donald Trump has apparently refused to shake Angela Merkel's hand during a joint appearance at the White House. The pair held an awkward meeting that could help determine the future of the transatlantic alliance and shape the working relationship between two of the world's most powerful leaders. While the President greeted the German leader with a handshake upon her arrival at the White House, he appeared to ignore requests to do so as the pair sat together later in front of TV cameras.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X