వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాషింగ్టన్ కరస్పాండెంట్స్ మీట్‌కు ట్రంప్ డుమ్మా

మీడియా నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ (డబ్ల్యుహెచ్‌సిఎ) ఆధ్వర్యంలో ఇచ్చే విందుకు గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: మీడియా నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ (డబ్ల్యుహెచ్‌సిఎ) ఆధ్వర్యంలో ఇచ్చే విందుకు గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆయన గౌరవార్థంతోపాటు కాలేజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మంజూరుచేసేందుకు అవసరమైన నిధుల సేకరణ లక్ష్యంగా వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ఈ వార్షిక విందు నిర్వహిస్తోంది.

ఈ విందు సమావేశానికి రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ప్రముఖులు హాజరవుతారు. సంప్రదాయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. తరుచుగా అమెరికా అధ్యక్షుడి పనితీరుపై కమెడియన్ వ్యాఖ్యలు, హ్రుద్యంగా అధ్యక్షుడి ప్రసంగం, దానిపై విమర్శకులు, రాజకీయ శత్రువుల వ్యాఖ్యలతో విందు వాతావరణం అంతా సరదాసరదాగా ఉంటుంది. అద్యంతం లైవ్ కార్యక్రమంగా సాగుతుంది.

<strong>పరిణామాలు.. ట్రంప్‌కు షాక్: అమెరికాలో తెలుగు వ్యక్తి మృతిపై జేకే రోలింగ్</strong>పరిణామాలు.. ట్రంప్‌కు షాక్: అమెరికాలో తెలుగు వ్యక్తి మృతిపై జేకే రోలింగ్

డబ్ల్యుహెచ్‌సిఏ విందుకు హాజరు కానన్న ట్రంప్

కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం 'నేను ఈ ఏడాది వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ నిర్వహించే వార్షిక విందు సమావేశానికి హాజరు కాబోవడం లేదు. ప్రతి ఒక్కరూ విందుకు హాజరై విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తున్నా' అని ట్వీట్ చేశారు. కానీ ఆయన ఎందుకు గైర్హాజరవుతున్నారో మాత్రం తెలియజేయలేదు. గమ్మత్తేమిటంటే ఇంతకుముందు ప్రతి ఏటా డబ్ల్యుహెచ్‌సిఎ ఆధ్వర్యంలో నిర్వహించే విందుకు సెలబ్రిటీగా ట్రంప్ క్రమం తప్పకుండా హాజరవుతుండే వారు. టీవీ రియాల్టీ షో యాంకర్‌గా, అందాల పోటీ నిర్వాహకుడిగా ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్‌కు సెలబ్రిటీ హోదా ఉండేది.

Donald Trump Says he Won't Attend White House Correspondents Dinner This Spring

తొలిసారి 2016లో విందుకు గైర్హాజరు

గత ఏడాది తొలిసారి విందుకు గైర్హాజరయ్యారు. దీనికి కారణం అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమై ఉండటమే. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడిగా అప్పటి బారక్ ఒబామాకు గౌరవం ఇవ్వాల్సి ఉంటుందన్న దుగ్ద కూడా ఉన్నదని తెలుస్తోంది. కానీ బారక్ ఒబామా మాత్రం ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తప్పించేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలతో సమావేశమవుతుంటారని, వారిలో మిస్ స్వీడన్, మిస్ అర్జెంటీనా, మిస్ అజర్ బైజాన్ తదితరులు ఉంటారని చమత్కరించారు. ఒకవేళ ఆయన హాజరై ఉంటే జోక్‌ల హరివిల్లుతో ట్రంప్ ప్రధాన లక్షంగా మారే వారు. ఆయనపై వచ్చే జోక్స్‌కు ట్రంప్ సమాధానం చెప్పాల్సి వచ్చేది. 2011లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ ఖర్చులను ఒబామా ప్రస్తావించినప్పుడు ఆయన అవమానంగా భావించారంటారు.

మీడియాతో ట్రంప్ సంబంధాలు అంతంతమాత్రమే

కానీ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మీడియాతో ఆయన సంబంధ బాంధవ్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అమెరికన్లకు శత్రువు 'దేశీయ మీడియా' అని అభివర్ణించారు. పలు ప్రముఖ దినపత్రిలకు ఫేక్ న్యూస్ ప్రచురిస్తున్నాయని ఆరోపించారు.

ట్రంప్ పరిగణనలోకి తీసుకుంటామన్న జెఫ్ఫ్ మానస్

ట్రంప్ ట్వీట్‌పై డబ్ల్యుహెచ్‌సిఎ అధ్యక్షుడు జెఫ్ఫ్ మాసన్ స్పందిస్తూ 'అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్‌ను పరిగణనలోకి తీసుకుంటాం' అని తెలిపారు. డిన్నర్‌కు హాజరు కారాదని డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అదే విధంగా కొనసాగాలని భావిస్తున్నామన్నారు. తద్వారా ఆరోగ్యకరమైన రిపబ్లిక్‌లో ముఖ్యమైన పాత్ర పోషించే మీడియా తొలిసారి సంబురాలు చేసుకునే అవకాశం వచ్చిందని తెలిపారు.

English summary
President Donald Trump, who has been criticizing the news media and is famously thin-skinned, says he won't be attending the White House Correspondents' Association dinner — sparing himself the dubious honor of being an in-the-house target of jokes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X