వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈజిప్ట్ మాజీ దేశాధ్యక్షుడు మోర్సీకి 20 ఏళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈజిప్ట్ మాజీ దేశాధ్యక్షుడు మహమ్మద్ మోర్సీకి 20 సంవత్సరాలు జైలు శిక్షను విధిస్తూ, ఆ దేశ న్యాయస్ధానం తీర్పునిచ్చింది. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2012లో నిరసనకారుల హత్యకేసులో ఆయన్ని దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ శిక్షను విధించినట్లు పేర్కొంది.

మహమ్మద్ మోర్సీపై పలు కేసు విచారణలో ఉండగా, శిక్షపడ్డ మొదటి కేసు ఇది. జులై 2012లో అధ్యక్ష భవనం ముందు నిరసన తెలుపుతున్న ప్రజలపై ఆయన చెప్పడంతోనే కాల్పులు జరిపారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనపై హత్యారోపణలను తొసిపుచ్చిన అక్కడి న్యాయస్ధానం 'బలాన్ని ప్రయోగించారు' అని పేర్కొంటూ, ఈ శిక్షను విధించింది.

మోర్సీతో పాటు మరో 14 మంది బ్రదర్ హుడ్ పార్టీ నేతలకూ ఇదే శిక్ష విధిస్తున్నట్లు జడ్జి తీర్పునిచ్చారు. 2012 చివరిలో ఈజిప్టు అధ్యక్ష భవనం వెలుపల జరిగిన ఘర్షణల్లో సుమారు 11 మంది చనిపోయారు.

మోర్సీపై విచారణలో ఉన్న కేసులు:

Egypt's ousted President Morsi jailed for 20 years

* హోస్నీ ముబారక్‌కు వ్యతిరేకంగా 2011లో విదేశీ మిలిటెంట్లతో కలిసి ఇస్లామిస్ట్‌లను విడిపించేందుకు గాను జైలు గొడలను బద్దలు కొట్టిన కేసు.

* పాలస్తీనా ఉద్యమ హమాస్, లెబనాన్ హెజ్‌బొల్లా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌తో చేతులు కలిపి ఈజిప్ట్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం.

* దోహాకు చెందిన ఆల్ జజీరా నెట్‌వర్క్ ద్వారా దేశానికి చెందిన రహస్యాలు మరియు సున్నితమైన పత్రాలు ఖతార్‌కు అమ్మేయడం.

English summary
An Egyptian court has sentenced former President Mohammed Morsi to 20 years in jail for ordering the arrest and torture of protesters during his rule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X