వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎస్ ఎయిర్‌లైన్స్ కావరం: రక్తం కారుతున్నా.. ఆసియా ప్రయాణికుడిని ఈడ్చేశారు(వీడియో)

యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ మరోసారి తన కండకావరాన్ని చాటుకుంది. ప్రయాణికుల పట్ల దురుసు ప్రవర్తించి మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటీవల లెగ్గింగ్స్‌ వేసుకున్నారని ఇద్దరు అమ్మాయిలను విమానం

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ మరోసారి తన కండకావరాన్ని చాటుకుంది. ప్రయాణికుల పట్ల దురుసు ప్రవర్తించి మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటీవల లెగ్గింగ్స్‌ వేసుకున్నారని ఇద్దరు అమ్మాయిలను విమానం ఎక్కనివ్వని ఆ సంస్థ.. తాజాగా ఓ ప్రయాణికుడిని విమానం నుంచి ఈడ్చేసి ఇతర ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది.

వివరాల్లోకి వెళితే.. షికాగో నుంచి లూయీస్‌విల్లే వెళ్లాల్సిన యునైటెడ్‌ ఫ్లైట్‌ 3411 లో పరిమితి కంటే ఎక్కువ టిక్కెట్లు బుక్కయ్యాయి. దీంతో విమాన సిబ్బంది కొందరిని విమానం నుంచి కిందకు దించేశారు. ఆసియాకు చెందినట్లుగా కనిపిస్తున్న ఓ వ్యక్తి మాత్రం విమానం దిగేందుకు నిరాకరించడంతో సెక్యురిటీ సిబ్బంది విమానంలోకి వచ్చి బలవంతంగా అతడిని ఈడ్చుకెళ్లారు.

చేతులు, కాళ్లు పట్టుకుని ఎత్తి తీసుకెళ్లారు. చొక్కా పైకి పోయినా, నోట్లో నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా చాలా దురుసుగా ప్రవర్తించారు. సెక్యురిటీ ప్రవర్తనతో మిగితా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఓవర్‌బుక్‌ చేయడం సంస్థ తప్పయినప్పటికీ ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించడంపై తీవ్రంగా మండిపడ్డారు.

ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా అది వైరల్‌‌గా మారింది. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది తీరు పట్ల నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంత జరిగినా ఆ ఎయిర్‌లైన్స్‌ ఉన్నతాధికారులు.. ప్రయాణికుడికి కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. సదరు ప్రయాణికుడు సెక్యురిటీ సూచనలు పాటించలేదని సమర్థించుకోవడం సిగ్గుచేటు.

ఇలాంటి ఘటనల నుంచి కంపెనీ పాఠాలు నేర్చుకుంటుందని, విమానం నుంచి దిగేందుకు వెయ్యి డాలర్ల పరిహారం కూడా ఇస్తామని చెప్పినా.. ఆ ప్రయాణికుడు దిగకపోవడంతో సెక్యురిటీ రంగంలోకి దిగిందని పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చికాగో ఏవియేషన్‌ విభాగం, యూఎస్‌ రవాణా విభాగం వెల్లడించాయి.

స్వచ్ఛందంగా విమానం దిగమని సిబ్బంది అడగగా.. ఎవ్వరూ ముందుకు రాలేదని, దీంతో వారే బయటకు పంపిచారని.. ఓ ఏషియన్‌ డాక్టర్‌, ఆయన భార్యను ఎంపిక చేసి వారిని విమానం నుంచి దించేశారని మరో వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. లూయీస్‌విల్లేకు అదనపు సిబ్బందిని పంపాల్సి రావడంతో వారికి సీట్లు ఇవ్వడానికి డబ్బు కట్టి టిక్కెట్‌ తీసుకున్న ప్రయాణికులను దించేశారని మరొకరు ట్వీట్‌ చేశారు.

కాగా, ఘటనకు సంబంధించి వీడియోను టైలర్‌ బ్రిడ్జెస్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. బలవంతంగా దించేసిన ప్రయాణికుడు తాను వైద్యుడినని.. రోగుల కోసం తాను కచ్చితంగా లూయీస్‌విల్లే వెళ్లాల్సి ఉందని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బందితో చెప్పారని బ్రిడ్జెస్‌ తన పోస్ట్‌లో తెలిపారు. బలవంతంగా దింపేస్తుంటే.. నోట్లో నుంచి రక్తం కారుతుండగా ఆయన 'నన్ను చంపేయండి, చంపేయండి.. నేను మాత్రం ఇంటికి వెళ్లాల్సిందే' అని అన్నట్లు తెలిపారు. కాగా, యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ వైఖరి పట్ల ప్రయాణికులతోపాటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు.

English summary
It is not just in India where alleged fights between passengers and crew members of airlines create national headlines. An incident involving the crew members of an American airline, who allegedly dragged and violently removed an elderly man of Asian-origin from one of their aircrafts, created a huge social media debate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X