వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కి'లేడీ' కవలలు: వృద్ధుడితో డేటింగ్ చేస్తామని దోచుకెళ్లారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఓ వెబ్‌సైట్‌లో ఫైండ్ యువర్ షుగర్ బేబీ అనే యాడ్‌ను చూసిన 84 ఏళ్ల వ్యక్తి అమ్మాయిలతో డేటింగ్ చేద్దామనుకుంటే మొదటికే మోసం వచ్చింది. అమ్మాయిలను ఆర్థికంగా ఆదుకుంటే వారు డేటింగ్ చేస్తారని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటన చూసిన పాల్ ఆరోన్సన్ అనే సీనియర్ సిటిజెన్.. సదరు సైట్ ద్వారా షాయినా ఫోస్టర్ అనే 17 ఏళ్ల యువతిని కాంటాక్ట్ చేశాడు.

మొదటి రోజు ఆమెను డిన్నర్‌కు తీసుకెళ్లాడు. రెండో రోజు షాయినా తన కవల సోదరి షలాయినేను తీసుకొచ్చింది. ఇది చూసి ఆ 84 ఏళ్ల వ్యక్తి ఆనందభరితుడయ్యాడు. వారిద్దరినీ తీసుకుని మిడ్ టౌన్లోని ఓ ఖరీదైన రెస్టారెంట్‌కు వెళ్లాడు. కడుపునిండా తిన్న తర్వాత, ఆరోన్సన్ ఆ కవల భామలను డ్రింక్‌కు ఆహ్వానించాడు.

Fantasy Date with Twins Turns Sour

దారిలో రాస్‌బెర్రీ ఫ్లేవర్ రమ్ బాటిల్ కొన్నాడు. తన నాలుగంతస్తుల ఇంటికి వారిని తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లాక అతను ఊహించింది జరగలేదు. ఆ కవలలు అతడిని కాఫీ టేబుల్‌కు కట్టి పడేశారు. అతను అలా 20 గంటల వరకు కట్టిపడేసే ఉన్నాడు.

అతడిని కట్టేసిన ఆ కిలాడీ లేడీలు అతని వ్యాలెట్‌లో నుండి 470 డాలర్ల క్యాష్, క్రెడిట్ కార్డులు తీసుకు వెళ్లారు. వాటితో దుస్తులు, మేకప్ కిట్లు షాపింగ్ చేశారు. వృద్ధుడు ఇంట్లోనే కట్టేసి పడి ఉండటం చూసిన పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన పోలీసులు కిలాడీ సిస్టర్స్‌ను అరెస్టు చేశారు.

English summary
The website billed itself as a place where older men with money could meet young women interested in dating someone who could support them financially.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X