వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలన తీర్పు : రేపిస్టు తండ్రికి 1,503 ఏళ్ల జైలు శిక్ష

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా : కడుపున పుట్టిన బిడ్డ అన్న కనీస మానవత్వం లేకుండా.. కన్న కూతురిపైనే అత్యాచారానికి తెగబడ్డాడో తండ్రి. అలా నాలుగేళ్ల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆమె జీవితాన్ని కకావికలం చేశాడు. విషయం కాస్త కోర్టు మెట్లెక్కడంతో.. నీచ బుద్ది కలిగిన సదరు తండ్రికి ఏకంగా 1,503 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో సుపీరియర్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

అయితే కేసుకు సంబంధించి సదరు తండ్రి వివరాలు గోప్యంగా ఉంచింది కోర్టు. తండ్రి వివరాలు బయటకు వస్తే.. కుమార్తెను సులభంగా గుర్తుపట్టే అవకాశం ఉండడం.. భవిష్యత్తులో ఆమెకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముండడంతో.. వివరాలను గోప్యంగా ఉంచింది కోర్టు. కాగా, ఇలాంటి నీచపు పోకడలకు పాల్పడే తండ్రుల వల్ల సమాజానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని జడ్జి ఎడ్వర్డ్ సర్కిసియాన్ జూనియర్ తన తీర్పు ద్వారా వెల్లడించారు.

తొలుత ఫ్యామిలీ ఫ్రెండ్ నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొంది బాలిక. అయితే సదరు ఫ్యామిలీ ఫ్రెండ్ ను మందలించాల్సింది పోయి.. కన్న తండ్రే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రాసిక్యూటర్ తెలిపారు. గత నెలలో ఈ కేసు విచారణకు రాగా తండ్రిని దోషిగా తేలుస్తూ తీర్పు ప్రకటించింది కోర్టు.

 Father sentenced to 1,503 years in prison in daughter's rape

తన తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నప్పుడు.. అతన్ని అడ్డుకునేంత శక్తి తన దగ్గర లేదని ప్రస్తుతం 23ఏళ్లున్న అతని కుమార్తె ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగేళ్ల పాటు తనపై అత్యాచారం జరిపిన తండ్రి.. ఏనాడు తనపై కనికరం చూపలేదని వాపోయింది. దీంతో కోర్టు అతనికి 1,503 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

ఇదిలా ఉంటే, ఇటీవలే మోంటానా కోర్టు ఓ రేపిస్ట్ తండ్రికి కేవలం 60రోజుల శిక్ష మాత్రమే విధించడం తెలిసిందే. ప్రస్తుతం సదరు న్యాయమూర్తిని తొలగించాల్సిందిగా అక్కడి వేలాదిమంది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా.. బాధితురాలి కుటుంబం సంతకాల సేకరణలో నిమగ్నమైంది. ఇలాంటి తరుణంలో మరో రేపిస్ట్ తండ్రికి 1503ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ కాలిఫోర్నియా కోర్టు తీర్పు వెలువరించడం గమనార్హం.
చేపడుతోంది.

English summary
The 41-year-old was sentenced Friday to the longest-known prison sentence in Fresno Superior Court history, the Fresno Bee reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X