వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా భావించొద్దు: ఒబామా ప్రకటనకు స్పందించిన ఫిడెల్ క్యాస్ట్రో

|
Google Oneindia TeluguNews

క్యూబా: అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకోవడం పట్ల క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో కొంత ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన రాసిన లేఖ రాష్ట్ర పత్రిక ‘గ్రాన్మా'లో ప్రచురితమైంది. ఆ లేఖలో 88ఏళ్ల క్యాస్ట్రో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.

అసలు తాను అమెరికా విధానాలను విశ్వసించనని, ఈ విషయంలో అమెరికన్లతో తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. అయితే దానర్థం అమెరికాతో క్యూబాకున్న సైనిక సంఘర్షణలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలనే ఉద్దేశం తనకు లేనట్లుగా భావించరాదని పేర్కొన్నారు.

Fidel Castro reacts to US-Cuba diplomatic thaw

శాంతిని పరిరక్షించడం అందరి బాధ్యతగా తాము భావిస్తామని, ప్రపంచ ప్రజలందరితోనూ తాము స్నేహాన్ని కోరుకుంటామని తెలిపారు. ప్రత్యర్థి దేశాలతో కూడా తాము స్నేహాన్నే వాంఛిస్తామని చెప్పారు.

క్యూబాతో సంబంధాల్లో తాము కొత్త అధ్యయానానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నామని డిసెంబర్ నెలలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బహిరంగంగా చేసిన ప్రకటనకు స్పందిస్తూ క్యాస్ట్రో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రపంచంలో క్యూబాను ఒంటరిని చేసేందుకు అనుక్షణం కుట్రలు పన్నుతూ వచ్చిన అమెరికాను తను పదవిలో ఉన్నంత కాలం గడగడలాడించిన క్యాస్ట్రో.. అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, ఫిడేల్ రాసిన తాజా లేఖతో అమెరికా-క్యూబాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Former Cuban leader Fidel Castro appears to have given tacit approval to the recent decision by Cuba and the US to restore diplomatic relations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X