వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హఫీజ్ వల్ల ముప్పే: పాక్ మంత్రి, భారత్ ప్రతినిధి అని విమర్శలు

ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ వల్ల తమ దేశానికి ముప్పు ఉందని పాకిస్తాన్ అంగీకరించింది. అయితే, ఆ వ్యాఖ్యల పైన విమర్శలు కూడా వచ్చాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ వల్ల తమ దేశానికి ముప్పు ఉందని పాకిస్తాన్ అంగీకరించింది. అయితే, ఆ వ్యాఖ్యల పైన విమర్శలు కూడా వచ్చాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసీఫ్.. హఫీజ్ సయీద్ పైన మాట్లాడారు. పాకిస్థాన్‌ ఇప్పటికే హఫీజ్‌ను ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద హౌస్ అరెస్టు చేసింది.

<strong>రెచ్చిన ఉగ్రవాదులు: కోర్టు ప్రాంగణంలో సూసైడ్ బాంబర్లు, 7గురి మృతి </strong>రెచ్చిన ఉగ్రవాదులు: కోర్టు ప్రాంగణంలో సూసైడ్ బాంబర్లు, 7గురి మృతి

సమాజానికి చెడు చేయడానికి ప్రయత్నించే ఇలాంటివారిని జాతీయ దృక్పథంతో అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అతని వల్ల తమ దేశానికి ముప్పు ఉందని చెప్పారు. సయీద్ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించాడని చెప్పారు.

For saying Hafiz Saeed is threat to country, Pakistan's defence minister is being called 'India's mouthpiece'

విమర్శలు

సయీద్‌తో తమ దేశానికి ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించిన పాకిస్తాన్ రక్షణ మంత్రి.. ఆ తర్వాత తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఆయన భారత దేశ ప్రతినిధి అంటూ పలు పార్టీలకు చెందిన నాయకులు, మతసంస్థల నాయకులు మంత్రిపై మండిపడ్డారు. హఫీజ్ సయీద్ దేశభక్తి గల నాయకుడని ఆకాశానికి ఎత్తారు.

పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) నేత మహ్మదూర్ రషీద్ మాట్లాడుతూ.. రక్షణ మంత్రి పాకిస్తాన్ మంత్రిలాగా మాట్లాడలేదని, భారత రక్షణ మంత్రిలా మాట్లాడారన్నారు.

<strong>పాకిస్తాన్‌ను మింగేస్తుంది: భారత్‌లో ఆప్గన్ స్పీకర్ హెచ్చరిక</strong>పాకిస్తాన్‌ను మింగేస్తుంది: భారత్‌లో ఆప్గన్ స్పీకర్ హెచ్చరిక

పాక్ మాజీ ప్రధాని మహ్మద్ అట్టిఖ్ సహా జమాతే ఇస్లామీ, డిఫెన్స్ ఆఫ్ పాకిస్తాన్ కౌన్సిల్ సంస్థల నేతలు మంత్రిపై విమర్శలు గుప్పించారు. మరోవైపు రక్షణమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా జమాతుల్ దవా పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలకు పూనుకుంది.

ఇదిలా ఉండగా, హఫీజ్ సయీద్ పైన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసీఫ్ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం స్వాగతించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం పరిధిలోకి హఫీజ్‌ను తీసుకురావడాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ స్వాగతించారు.

English summary
For saying Hafiz Saeed is threat to country, Pakistan's defence minister is being called 'India's mouthpiece'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X