వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరు క్లబ్‌కు బాకీ పడిన బ్రిటన్ మాజీ ప్రధాని

|
Google Oneindia TeluguNews

లండన్: రాజకీయ నాయకులు, సినీరంగానికి చెందిన వారు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ఆదాయపు పన్ను చెల్లించకుండా ప్రభుత్వాలను మోసం చేయ్యడం, మంత్రులు, శాసన సభ్యులు నీటి బిల్లు, విద్యుత్ బిల్లు చెల్లించలేదని ఎన్నో సార్లు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే బ్రిటన్ మాజీ ప్రధాని అప్పు ఉన్నాడనే లెక్కలు భారతదేశంలో భద్రంగా ఉన్నాయని వెలుగు చూసింది.

బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ బెంగళూరు క్లబ్ కు బాకీ పడ్డారని లెక్కలు ఉన్నాయని వెలుగు చూసింది. బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ చెల్లించ వలసిన మొత్తం అక్షరాల 13 రూపాయలు అని క్లబ్ అప్పుల జాబితాలో పోందుపరిచారని బీబీసీ వెల్లడించింది.

ఈ విషయాని బీబీసీ న్యూస్ ప్రసారం చేసింది. చర్చిల్ బెంగళూరు వచ్చిన సమయంలో ఆయన బెంగళూరు క్లబ్ లో బస చేశారు. బెంగళూరు సిటి క్లబ్ ఖాళీ చేసి వెళ్లే సమయంలో చర్చిల్ రూ. 13 బిల్లు చెల్లించలేదని బీబీసీ స్పష్టం చేసింది.

Former British Prime Minister Winston Churchill still figures on the list of defaulters

బెంగళూరు క్లబ్ లో ఇప్పటి వరకు 17 మంది బాకీ చెల్లించవలసి ఉంది. ఆ 17 మందిలో బ్రిటన్ మాజీ ప్రధాని ఒకరు. 1899లో చర్చిల్ బెంగళూరు క్లబ్ లో ఉన్నారని రికార్డులు ఉన్నాయి. 1896లో చర్చిల్ ఒక సైన్యాధికారి. ఆ సమయంలో ఆయన బెంగళూరు వచ్చారు. మూడు సంవత్సరాల పాటు బ్రిటీష్ సైన్యాధికారిగా ఉన్నారు. తరువాత బెంగళూరు క్లబ్ ఖాళీ చేసి ఇంగ్లాండ్ వెళ్లిపోయారు.

1868లో కొందరు బ్రిటీష్ దేశస్తులు బెంగళూరు క్లబ్ ఏర్పాటు చేశారు. భారతదేశంలోని ప్రసిద్ది చెందిన క్లబ్ లలో బెంగళూరు క్లబ్ మొదటి వరసలో ఉంది. అంతటి చరిత్ర కలిగిన బెంగళూరు క్లబ్‌కు ఒక దేశానికి చెందిన మాజీ ప్రధాని బాకీ పడ్డారని బీబీసీ ప్రచారం చేసింది.

English summary
Former British Prime Minister Winston Churchill still figures on the list of defaulters of the exclusive Bangalore Club in south India as he owes the club 13 rupees in unpaid bills. An entry, dating back to June 1899, in the club's ledger book listed "Lt WLS Churchill" as one of 17 defaulters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X