ఇంట్లోకి దూసుకెళ్లిన రైలు: నలుగురు మృతి, పలువురికి గాయాలు(వీడియో)

Subscribe to Oneindia Telugu

ఏథెన్స్‌: ఉత్తర గ్రీస్‌లో ఓ రైలు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఏథెన్స్‌ నుంచి బయల్దేరిన రైలు థెస్సాలోన్కీ పట్టణం వద్ద పట్టాలు తప్పి ఒక ఇంట్లోకి దూసుకెళ్లింది.

train crash

ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి క్షణాల్లో ఇంటి బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ రైలు పట్టాలు తప్పటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ రైలులో సుమారు 70 మంది ప్రయాణిస్తున్నారు.

ప్రమాద సమాచారం అందుకున్న సహాయక బృందాలు.. చాలమందిని రక్షించాయి. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. గ్రీస్‌లోనే రెండో అతిపెద్ద నగరమైన థెస్సాలోన్కీకి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

English summary
An intercity train derailed in northern Greece, leaving four passengers dead and five seriously injured, including the driver, the state railway said in a statement early Sunday.
Please Wait while comments are loading...