వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీచ్‌లో ముస్లిం మహిళ బట్టలూడదీయించిన ఫ్రాన్స్ పోలీసులు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

పారిస్: మానవత్వం మంటగలిసిన సంఘటన ఒకటి ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. గత నెలలో ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో శరీరానికి, ముఖానికి బురఖా లాంటి దుస్తులను ధరించడం అక్కడి ప్రభుతం నిషేధించింది.

ఈ క్రమంలో నైస్ నగరంలోని సముద్ర తీరంలో మధ్య వయస్కురాలైన ఓ ముస్లిం యువతి బుర్కినీ ధరించి కూర్చుండగా, ఆయుధాలు, పెప్పర్ స్పేలతో ఆమెను సమీపించిన నైస్ నగర పోలీసులు బలవంతంగా ఆమె బట్టలు ఊడదీయించి తనిఖీలు చేశారు.

French police make woman remove clothing on Nice beach following burkini ban

ఈ ఘటనకు సంబంధించి ఆమె చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌లా మారాయి. అంతేకాదు తనిఖీలు జరిపే సమయంలో మహిళా పోలీసులు లేకపోవడం విశేషం. దీంతో బాధితురాలికి మద్దతుగా నిలిచేలా 'బుర్కినీగేట్' పేరిట ఓ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

ఈ సంఘటన 23వ తేదీ (మంగళవారం) నాటు చోటు చేసుకోగా, పోలీసుల నిర్దయ ఈ చిత్రాల్లో కనిపిస్తోంది. ఓ మహిళ పట్ల నైస్ నగర పోలీసులు ప్రవర్తించిన తీరును పలువురు సామాజిక వాదులు తీవ్రంగా విమర్శిస్తుండగా, తమ దేశంలో బురఖాలపై నిషేధం ఉందని పోలీసు వర్గాలు తమ చర్యను సమర్థించుకోవడం విశేషం.

French police make woman remove clothing on Nice beach following burkini ban

బుర్కినీలు అంటే?
ముస్లిం మహిళలు ఈత పోటీలలో పాల్గొనేందుకు వీలుగా బురఖా తరహాలో ఉండే స్విమ్ సూట్లను రూపొందించారు. వీటిని బుర్కినీలు అంటారు. దాదాపు దశాబ్దం క్రితమే లెబనీస్ జాతికి చెందిన ఆస్ట్రేలియన్ మహిళ ఒకరు ముస్లింలు ధరించేందుకు వీలుగా స్విమ్‌సూట్లను రూపొందించారు. దాన్నే బుర్కినీ లేదా బుర్ఖినీ అంటున్నారు.

ఇవి తల నుంచి పాదాల వరకు మొత్తం ఉంటాయి. ఫ్రాన్స్‌లో ఇవి అంతగా కనిపించేవి కావు. సాధారణంగా అక్కడ సన్‌బాత్ కోసం మహిళలు అర్ధనగ్నంగా బీచ్‌లలో విశ్రాంతి తీసుకుంటారు. ఇటీవల నైస్ నగరంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం బురఖా తరహాలో ఉండే స్విమ్‌ సూట్లను నిషేధించడంతో ఫ్రెంచి మేయర్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Photographs have emerged of armed French police confronting a woman on a beach and making her remove some of her clothing as part of a controversial ban on the burkini.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X