వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళ వెంటపడి వేధించిన ఉడత: అరెస్ట్(వీడియో)

|
Google Oneindia TeluguNews

బెర్లిన్: జర్మనీలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తనను వెంటపడి వేధిస్తున్న ఓ ఉడతపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ ఉడతను వెతికి పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు.

Bottrop: Eichhörnchen nach Verfolgung in Gewahrsam genommen Ein sehr ungewöhnlicher Notruf erreichte heute Morgen die Polizei in Bottrop. Ein Eichhörnchen verfolgte eine junge Frau an der Eichenstraße.Die Beamten stellten fest: das stimmt! Sie nahmen den Verfolger in Gewahrsam und brachten ihn zur Polizeiwache. Dort zeigte das Eichhörnchen erste Erschöpfungserscheinungen, denen die Beamten mit Apfelstücken und Honigtee entgegenwirkten. Frisch gestärkt soll es dann einer Auffangstation übergeben werden.----------------------#Polizei#Recklinghausen

Posted by Polizei NRW Recklinghausen on Wednesday, July 15, 2015

వివరాల్లోకి వెళితే.. జర్మనీ పశ్చిమ ప్రాంతంలోని బ్రోటాప్ నగరంలో సదరు మహిళ వీధిలో వెళుతుండగా ఓ ఉడత వెంటపడింది. ఎంత అదిలించినా పోలేదు. ఆమె చుట్టూనే తిరుగుతూ బాగా ఇబ్బందిపెట్టింది. దీంతో ఆ ఉడత వేధింపులు తట్టుకోలేక సదరు మహిళ పోలీసులకు ఫోన్ చేసింది.

German police puts aggressive squirrel 'behind bars'

ఆమె ఫిర్యాదు మేరకు ఓ పోలీసు అధికారి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ ఉడతను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ ఉడతను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నామని మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పోలీసులు పేర్కొన్నారు.

కాగా, ఆ పోలీస్ స్టేషన్‌లో ఆ ఉడతకు ఓ మహిళా పోలీసు అధికారిణి మేత పెడుతున్న దృశ్యాలతో కూడిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ ఉడత బాగా అలసిపోయినట్టు కనిపిస్తోందని, కొంచెం బలం వచ్చిన తర్వాత దాన్ని రెస్క్యూ హోంకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.

English summary
In a bizarre incident, an aggressive squirrel was 'arrested' by police in Germany after a woman complained that the rodent was following her around.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X