వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ట్విస్ట్: ప్రేయసి తిరస్కరించిందని విమానాన్ని కూల్చేశాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్సా పర్వతాల్లో 'ఎయిర్‌బస్ ఏ-320' విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసి 150 మందిని పొట్టన పెట్టుకున్న జర్మనీ వింగ్స్ కో-పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ మానసిక రోగి అని, విమానాన్ని కూల్చేసిన రోజు వరకు కూడా మానసిక వ్యాధికి కౌన్సెలింగ్ తీసుకున్నాడని ప్రముఖ జర్మనీ వార్తా పత్రిక 'బిల్డ్' శుక్రవారం వెల్లడించింది.

బాత్‌రూమ్‌కు వెళ్లిన పైలట్‌ను తిరిగి కాక్‌పిట్‌లోకి రాకుండా క్యాబిన్ డోర్‌ను లాక్‌ చేసి విమానాన్ని తలకిందులుగా తీసుకెళ్లి పర్వతాల్లో కో-పైలట్ లూబిడ్జ్ కూల్చేసినట్టు గురువారం ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్ వెల్లడించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్న గర్ల్ ఫ్రెండ్, రెండు వారాల క్రితం అభిప్రాయ భేదాలొచ్చి తనతో విడిపోయిందని, అప్పటి నుంచి ఆయన మానసిక జబ్బు మళ్లీ తిరగతోడిందని, అందుకోసం సైకో థెరపీ కింద కౌన్సెలింగ్ తీసుకుంటూ వచ్చాడని ఆ పత్రిక పేర్కొంది.

తీవ్ర మనస్తాపంతో రగిలిపోతున్న టూబిడ్జ్ విమానాన్ని కూల్చేయడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపింది. 28 ఏళ్ల లూబిడ్జ్ 2008లో పైలట్ శిక్షణ సందర్భంగా కొన్ని నెలలపాటు సెలవు తీసుకొని మానసిక జబ్బుకు సైకో థెరపి తీసుకున్న విషయం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది.

Germanwings crash: Co-pilot 'treated for depression'

విమాన ప్రమాద సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్న పోలీసు అధికారుల బృందం గురువారం నాడు నాలుగు గంటలపాటు మోంటబార్‌లోని కో-పైలట్ లూబిడ్జ్ ఫ్లాట్‌ను శోధించగా ఓ గర్ల్ ఫ్రెండ్‌తో వ్యవహారం ఉన్నట్టు, మానసిక వ్యాధికి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసింది. పైలట్ శిక్షణ సందర్బంగా కొన్ని నెలలపాటు లూబిడ్జ్ సెలవుపై వెళ్లినట్టు ధ్రువీకరించిన లుఫ్తాన్సా విమానయాన సంస్థ హెడ్ కార్‌స్టెన్ స్పార్.. అతడి మానసిక వ్యాధి విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. లుఫ్తాన్సా విమానయాన సంస్థ తరపున అమెరికాలోని ఆరిజోనాలో పైలట్ శిక్షణ పొందిన లూబిడ్జ్ ఏకంగా ఏడాది పాటు మానసిక వ్యాధికి సైకో థెరపీ తీసుకున్నాడని తెల్సింది.

అయితే అన్ని పరీక్షలతోపాటు, మానసిక పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడయ్యాకే ఆయన్ని పైలట్‌గా ఎంపిక చేశామని కార్‌స్టెన్ స్పార్ తెలిపారు. లూబిడ్జ్ నివాసంలో దొరికిన పత్రాల ప్రకారం విమాన ప్రమాదం జరిగిన ముందు రోజు వరకు కూడా మానసిక వ్యాధికి కో-పైలట్ కౌన్సెలింగ్ తీసుకుంటూ వచ్చాడు. విమానం ఎక్కే సందర్భాల్లో కూడా డాక్టర్ సలహా తీసుకున్నాకే విమానాన్ని నడపాల్సి ఉంటుందని కూడా ఆయనకు వైద్యం చేస్తున్న సైకాలజిస్ట్ సూచించారు.

'ఓ పాఠశాల లేదా సైనిక క్యాంప్‌పై దాడిచేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఎంతో మంది ప్రాణాలుతీసి తాను ఆత్మహత్య చేసుకునే మానసిక వ్యాధిగ్రస్థుడిలాగా లూబిడ్జ్ ప్రవర్తన కనిపిస్తోంది' అని బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ సైకాలాజీ ప్రొఫెసర్ క్రేగ్ జాక్సన్ వ్యాఖ్యానించారు.

English summary
The man suspected of deliberately crashing a Germanwings A320 plane in the French Alps required treatment for depression, German media say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X