వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్మన్ వింగ్స్: ఆ బ్లాక్‌బాక్స్ దొరకకపోవచ్చు, కీలక సమాచారం గల్లంతేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

ప్యారిస్: వారం రోజుల క్రితం ఆల్ఫ్స్ పర్వతాల్లో కూలిన జర్మన్ వింగ్స్ ఎయిర్‌బస్ ఏ320 రెండో బ్లాక్ బాక్స్ లభించకపోవచ్చునని అంటున్నారు. మొదటి బ్లాక్ బాక్స్ దొరికింది. అందులోని వాయిస్ రికార్డ్‌ను కూడా పరిశీలించారు.

అయితే, రెండో బ్లాక్ బాక్స్ దొరికితేనే ఏం జరిగిందనే పూర్తి సమాచారం లభించవచ్చునని అంటున్నారు. ఆ రెండో బ్లాక్ బాక్స్ లభించకుంటే ప్రమాదానికి గల కీలక ఆధారం లభించకపోవచ్చునని చెబుతున్నారు.

విమాన ప్రమాదం నేపథ్యంలో ఎక్కువ స్థాయిలో నష్టం జరిగిందని, అఆందుకే ఫ్లైట్ డేటా రికార్డర్ ఏ ప్రమాద సూచనలు పంపించలేదని లుఫ్తాన్సా మేనేజర్ కే క్రాక్తీ స్థానిక మీడియాతో చెప్పారు.

Germanwings: Flight data recorder will not be found, says Lufthansa manager

కాక్ పిట్‌లోని వాయిస్ రికార్డర్ లేదా తొలి బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత డేటా రికార్డర్ లేదా సెకండ్ బ్లాక్ బాక్స్ కోసం సెర్చ్ ఆపరేషన్ వారు వెతికారని, కానీ అది దొరకలేదని చెప్పారు. వాయిస్ రికార్డర్ లేదా తొలి బ్లాక్ బాక్స్ ద్వారా ఆడియో వినిపించిన విషయం తెలిసిందే.

విమాన ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ చాలా కీలకమైనవి. అందులో ఒకటే లభించింది. మరొకటి లభించవలసి ఉంది. రెండోది దొరికితేనే అసలు ఏం జరిగిందనే విషయం తెలియవచ్చునని అంటున్నారు. డేటా రికార్డర్ లేదా సెకండ్ బ్లాక్ బాక్స్‌లో విమానానికి సంబంధించి ఏం జరిగిందనేది పూర్తిగా ఉంటుంది. ప్రతి సెకండ్ ఏం జరిగిందనేది అందులో రికార్డై ఉంటుంది.

English summary
The flight data recorder of the crashed Germanwings Airbus 320 which could provide key evidence about the causes of the crash on March 24 may never be found, media reported on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X