వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమోషన్: అల్ఫాబెట్ బోర్డ్ డైరెక్టర్‌గా సుందర్ పిచాయ్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ సాధిస్తున్న ఫలితాలను సంస్థ గుర్తించింది. ఈ క్రమంలో సుందర్ పిచాయ్‌కి గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్‌ డైరెక్టర్ల బోర్డులో చోటు కల్పించింది. సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ సీఈఓగా సుందర్‌ పిచాయ్‌ ఎంతో బాగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆల్ఫాబెట్‌ సీఈఓ లారి పేజ్‌ కొనియాడారు.

పటిష్ట వృద్ధి, భాగస్వామ్యాలు, వినూత్న ఉత్పత్తులు అధికసంఖ్యలో ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, ఆల్ఫాబెట్‌ బోర్డులో సుందర్‌ చేరడం మరింత ఉత్సుకత కలిగిస్తోందని ఆల్ఫాబెట్‌ సీఈఓ లారి పేజ్‌ పేర్కొన్నారు.

Google CEO Sundar Pichai is joining the Alphabet board of directors

2015 అక్టోబరు నుంచీ గూగుల్‌కు నాయకత్వం వహిస్తున్నారు. 13 మంది డైరెక్టర్లున్న ఆల్ఫాబెట్‌ బోర్డులో సుందర్‌ పిచాయ్‌ నియామకం జులై 19 నుంచి అమల్లోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన పిచాయ్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు.

English summary
Sundar Pichai has another job to do: serve on the board of directors for Alphabet, the parent company for Google. Pichai has been the CEO of Google since the creation of Alphabet in October 2015 — a move that split out a bunch of somewhat random businesses into quasi-independent companies separate from Google proper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X