వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్ రికార్డు

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ 199 మిలియన్‌ డాలర్ల విలువ చేసే స్టాక్స్‌ సొంతం చేసుకొని రికార్డు సృష్టించారు. అత్యధిక వేతనం పొందుతున్న గూగుల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పిచాయ్ ఘనత పొందారు.

గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ సుందర్‌కు 199 మిలియన్‌ డాలర్ల విలువ చేసే 273,328 క్లాస్‌ సి గూగుల్‌ స్టాక్‌ యూనిట్లను ఇచ్చింది. వీటి విలువ రూపాయల్లో సుమారు 1,356 కోట్లు ఉంటుంది. దీంతో అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న అమెరికా కంపెనీల ఎగ్జిక్యూటివ్స్‌లో పిచాయ్‌ అగ్రస్థానంలో నిలిచారు.

Google CEO Sundar Pichai is now the highest paid executive in the US

భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌ 2015 ఆగస్టులో గూగుల్‌ సీఈఓగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా వచ్చిన షేర్లతో అల్ఫాబెట్‌లో ఆయన షేర్ల విలువ సుమారు 650 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.4,430 కోట్లు)చేరింది.

అల్ఫాబెట్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రూత్‌ పోరట్‌కు కూడా 38.3 మిలియన్‌ డాలర్ల విలువ చేసే స్టాక్స్‌ లభించాయి. గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ అధిపతి డియానే గ్రీనేకు కూడా 42.8మిలియన్ డాలర్ల స్టాక్స్‌ను కట్టబెట్టారు.

English summary
Google CEO Sunder Pichai is now the highest paid executive in the US. Pichai's net worth rose after he was awarded 273,328 shares of Google's holding company Alphabet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X