వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: యువతిని తీవ్రంగా కొట్టి, సజీవ దహనం చేశారు

|
Google Oneindia TeluguNews

గ్వాటెమాల: ఓ యువతిని తీవ్రంగా కొట్టిన కొందరు, ఆమెను సజీవ దహనం చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర అమెరికా ఖండంలోని గ్వాటెమాల దేశంలో చోటు చేసుకుంది. గ్వాటెమాల నగరానికి సమీపంలోని రియో బ్రావోలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది.

 Guatemala horror: Teenage girl lynched by mob

అక్కడి మీడియా కథనాల ప్రకారం.. ఓ టాక్సీ డ్రైవర్‌ను హత్య చేసిన ముఠాలో సభ్యురాలిగా ఆ యువతిని అనుమానించిన మృతుడి బంధువులు, మరికొందరు కలిసి ఆమెను తీవ్రంగా కొట్టారు. రక్తం కారుతున్నా ఏ మాత్రం కనికరం లేకుండా దాడి చేశారు.

అంతటితో ఆగని వారు ఆమెను సజీవ దహనం చేశారు. కాగా, ఈ ఘటన మొత్తాన్ని కొందరు కెమెరాల్లో చిత్రీకరించారు. ఈ దేశంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయని అక్కడి మీడియా వెల్లడించింది. ఎక్కువగా పేద వర్గాల్లోనే చోటు చేసుకుంటాయని తెలిపింది.

కాగా, ఆ యువతిని రక్తం వచ్చేలా కొడుతున్న ఆ దుర్మార్గులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురు పోలీసులను కూడా అక్కడి వారు అడ్డుకోవడం విచారకరం.

English summary
In a shocking incident of lynching by mob, a teenage girl in Guatemala was lynched and burnt to death alive, media reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X