వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్1బీ వీసా: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్! పీహెచ్.డీ పొందిన వారికి మినహాయింపు!

హెచ్1బీ వీసా విషయంలో భారతీయులకు షాక్ ల మీద షాకులు ఇచ్చిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పబోతోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : హెచ్1బీ వీసా విషయంలో భారతీయులకు షాక్ ల మీద షాకులు ఇచ్చిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఉద్యోగ ఆధారితంగా ఇచ్చే గ్రీన్ కార్డులు, హెచ్ 1బీ వీసాల కఠినతరమైన నిబంధనల నుంచి సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమ్యాటిక్స్ ల్లో అమెరికా యూనివర్సిటీల నుంచి పీహెచ్.డీ పొందిన విదేశీయులను మినహాయించాలని కోరుతూ ప్రతినిధుల సభలో మరోసారి ఓ బిల్లును ప్రవేశపెట్టారు.

కాంగ్రెస్ సభ్యులు ఎరిక్ పాల్సన్, మైక్ క్విగ్లిలు ''లీవింగ్ ది ఎకానమీ యాక్ట్(స్టాపల్)'' పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుతో భారతీయ విద్యార్థులు లబ్ది పొందనున్నట్టు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో భారతీయ విద్యార్థులు అమెరికాలో పీహెచ్ డీ లు పొందుతున్నారు.

H1B visa: Bill seeking exemption for foreigners with US PhD introduced

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను అమెరికాకు తెచ్చుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని, ఇక్కడ చదివి, శిక్షణ పొందిన విద్యార్థులు, అమెరికా ఆర్థిక వ్యవస్థకే ఉపయోగపడేలా తాము అన్ని చర్యలు తీసుకోనున్నట్టు కాంగ్రెస్ సభ్యుడు ఎరిక్ పాల్సన్ చెప్పారు.

వేలకొద్ది ప్రతిభావంతులైన ఉద్యోగాలు ఇంకా భర్తీ కాలేదని, స్టాపల్ యాక్ట్ తో కంపెనీలకు అవసరమైన నిపుణులను పొందవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా కొత్త కొత్త ఆవిష్కరణలను, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తూ గ్లోబల్ మార్కెట్ ప్లేస్ లో పోటీదారుడిగా నిలవాలంటే, తాము కచ్చితంగా ప్రపంచంలో ఉన్న చురుకైన విద్యార్థులకు తమ కమ్యూనిటీల్లో చదువుకునేలా, పనిచేసేలా ప్రోత్సహించాల్సి ఉందని క్విగ్లీ తెలిపారు.

గత నెలలోనే హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ ను దుర్వినియోగపరచకుండా కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తీసుకొచ్చారు. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలను కాపాడుకోవడానికి హైర్ అమెరికా నిబంధనలను తీసుకొస్తున్నట్టు చెప్పారు.

English summary
H1B visa: Bill seeking exemption for foreigners with US PhD introduced
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X