వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రెజర్ హంటర్ ఇదే!: ఆర్కిటిక్ వద్ద హిట్లర్ రహస్య స్థావరం

|
Google Oneindia TeluguNews

జర్మనీ: ఉత్తర ధ్రువానికి సుమారు 1000 కిలో మీటర్ల దూరంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఆదేశాల మేరకు గతంలో నిర్మించిన ఓ రహస్య స్థావరాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని అలెగ్జాండ్రా ల్యాండ్ వద్ద దశాబ్దాల క్రితం ట్రెజర్ హంటర్ పేరుతో వ్యవహరించిన రహస్య ప్రాంతం ఇదేనని కనుగొన్నారు.

ఇది ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న నిర్మానుష్యమైన ఒక దీవి. దాదాపు 500 వస్తువులు, బంకర్లు, వాడేసిన పెట్రోల్‌ క్యాన్లు, పేపర్‌ డాక్యుమెంట్లు ఇప్పటికీ అక్కడ భద్రంగానే ఉన్నాయి. దీనిని 1942లో నేరుగా హిట్లర్‌ ఆదేశాల మేరకే నిర్మించినట్లు భావిస్తున్నారు.

Hitler's Secret Nazi Base Discovered In Arctic

తర్వాత ఇది 1943 నుంచి అందుబాటులోకి వచ్చింది. కానీ 1944లో ఇక్కడికి ఆహార సరఫరా నిలిచిపోవడంతో విషపూరితమైన ఓ ఎలుగుబంటి కళేబర మాంసం తిని సిబ్బంది మృతి చెందారని డెయిలీ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది. ప్రస్తుతం ఇది మనుష్య సంచారం లేని దీవిగా ఉంది.

రష్యా పైన దండెత్తడానికి ఏడాది ముందు అంటే 1942లో నేరుగా దీనిని నిర్మించినట్లు భావిస్తున్నారు. ఇంతకుముందు రాతల ద్వార మాత్రమే మనకు కొన్ని విషయాలు తెలుసునని, ఇప్పుడు అందుకు సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయని రష్యా ఆర్కిటిక్ నేషనల్ పార్క్ సీనియర్ రీసెర్చర్ ఎర్మోలోవ్ తెలిపారు. ఆధారాల్లో బుల్లెట్లు, చినిగిపోయిన శిబిరాలు, షూలు, నాటి తేదీలు, స్వస్తిక్ మార్కులు తదితరాలు లభించాయి.

English summary
Scientists have discovered a secret Nazi base built on direct orders from German dictator Adolf Hitler located 1,000 kilometres from the North Pole.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X