వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

’గే’గా ఉన్నందుకు గర్వంగా ఉంది: ఆపిల్ సిఈఓ టిమ్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: తాను గేగా ఉన్నందుకు చాలా గర్వంగా భావిస్తున్నానని ప్రముఖ కంపెనీ ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(సిఈఓ) టిమ్ కుక్ అన్నారు. ఇటీవల బ్లూంబర్గ్ బిజినెస్ వీక్‌కు రాసిన కథనంలో ఆయన పలు విషయాలపై స్పందించారు. తన లైంగికతను తాను తిరస్కరించడం లేదని, గే ఉన్నందుకు గర్వంగా భావిస్తున్నానని చెప్పారు.

తన లైంగికత గురించి చాలా మందికి తెలుసని, తన కంపెనీ ఆపిల్ సహోద్యుగులకు కూడా తాను గే అని తెలుసని ఆయన చెప్పారు. ఆయన బ్లూంబర్గ్ బిజినెస్ వీక్‌కు రాసిన కాలమ్ గురువారం ప్రచురితమైంది. లైంగికత గురించి బహిర్గతం చేయడం చాలా కష్టమని పేర్కొన్న కుక్, తాను ఇలా తన లైంగికతపై బహిర్గతం చేయడం వల్ల తనలాంటి వారికి ఆత్మస్థైర్యం వస్తుందని చెప్పారు.

తాను రియలైజ్ అయిన తర్వాతే తన లైంగికత గురించిన విషయాలను బహిర్గతం చేస్తున్నానని కుక్ తెలిపారు. తన వ్యక్తిగత ప్రైవసీ అనేది కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వెనకకు వెళుతున్నాయని చెప్పారు.

అంతేగా, తాను గే ఉండటం అనేది దేవుడి తనకిచ్చిన గొప్ప బహుమతి కుక్ పేర్కొన్నారు. తాను ఓ కంపెనీతో పని చేయడం అదృష్టంగా భావిస్తానని చెప్పారు. కొత్తదనాన్ని, క్రియెటివిటీని ఇష్టపడతానని కుక్ తెలిపారు. ప్రజల్లో తేడాలు ఉండటం వల్లే వృద్ధి జరుగుతుందని అన్నారు.

తాను ఉత్తమ సిఈవోగా కొనసాగేందుకు కృషి చేస్తానని కుక్ పేర్కొన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందించేందుకు తాను వ్యక్తిగతంగా దృష్టి పెడతానని చెప్పారు.

English summary
The public declaration, in an essay written for Bloomberg Businessweek, makes Cook the highest-profile business CEO to come out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X