వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు ఇండియా షాక్: దక్షిణ చైనా సముద్రంలో ఇండియా మిస్సైల్

దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాకు భారత్ షాకిచ్చింది.భారతీయ క్షిపణులు చైనాకు సవాల్ విసిరాయి.వియత్నాంకు భారత్ మిస్సైల్స్‌...

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదే అంటున్న చైనాకు భారత్ షాకిచ్చింది. దక్షిణ చైనా సముద్రంపై భారతీయ క్షిపణులు చైనాకు సవాల్‌గా మారాయి.

వాస్తవానికి దక్షిణ చైనా సముద్రంపై బ్రూనై, మలేషియా, ఇండోనేషియా ఫిలిఫ్పెన్స్, వియత్నాంలకు కూడ అధికారాలున్నాయి. అయితే చైనా మిగిలిన దేశాలను బెదిరిస్తూ సముద్రం మొత్తం తమ కిందకే వస్తోందని వాదిస్తోంది.

దక్షిణ చైనా సముద్ర తీరం కలిగిన వియత్నాంతో భారత్‌కు ఎప్పటినుండో స్నేహసంబంధాలున్నాయి. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసేలా వియత్నాంకు ఓడలపై నుండి ప్రయోగించే అత్మధిక శక్తివంతమైన మిస్సైల్స్ బ్రహ్మెస్‌ను అందించింది.

India's New Move With BrahMos Cruise Missile Likely To Anger China

కొన్నేళ్ళుగా భారత్-వియత్నాంల మధ్య ఈ మిస్సైల్ అమ్మకానికి చర్చలు జరుగుతున్నాయి. చైనా భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతుండడంతో భారత్ ఈ మిస్సైల్స్‌ను వియత్నాంకు ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత నేవీ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన మిస్సైల్ బ్రహ్మోస్ ధ్వని వేగం కంటే రెండున్నర రెట్టు అధిక వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని స్వంత ఓడల నుండి సులువుగా ప్రయోగించే అవకాశం దక్కుతోంది.

ప్రపంచదేశాల వద్ద ఉన్న ఈ తరహ మిస్సైల్స్‌లో బ్రహ్మోస్ అత్యాధునికం, భారత్ నుండి తొలి విడతగా అందాల్సిన బ్రహ్మోస్ మిస్సైల్స్ తమ వద్దకు చేరుకొన్నట్టు వియత్నాం అధికారి తెలిపారు. అయితే బ్రహ్మోస్ క్షిపణుల అమ్మకంపై భారత్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

English summary
At a time when India and China are dealing with their worst border tension in decades, Vietnam has reportedly acquired the Indian BrahMos supersonic anti-ship cruise missile, widely considered one of the most advanced missiles of its type in the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X