వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆవుని చంపడమంటే, హిందూ బాలికను రేప్ చేసినట్లే'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌కు అక్రమంగా జరుగుతున్న ఆవుల రవాణాను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికోసం దాదాపు 30,000 వేల మంది బీఎస్ఎఫ్ సిబ్బందిని సరహద్దుల వద్ద మొహరించింది.

దీంతో కొద్ది రోజుల్లోనే బీఎస్ఎఫ్ సిబ్బంది సుమారు 90వేల ఆవులతో పాటు 400 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ ముస్లిం దేశం కావడంతో అక్కడ ఆవు మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది.

ఈ క్రమంలో భారత్ నుంచి ప్రతీ రాత్రి పంట పొలాలు, చెరువుల నుంచి ఆవులను అక్రమంగా స్మగ్లర్లు బంగ్లాదేశ్‌కు తరలిస్తుంటారు. ఇలా ప్రతి ఏడాది సుమారు 2 మిలియన్ ఆవులు భారత్ నుంచి బంగ్లాకు తరలిపోతున్నట్టు సమాచారం.

India's push to save its cows starves Bangladesh of beef

అంతేకాదు ఆవుల ద్వారా ఏడాదికి సుమారు నాలుగు వందల కోట్ల వ్యాపారం జరుగుతుందని ఢాకా వర్గాలద్వారా తెలుస్తోంది. ఈ ఆవుల రవాణాకు ఇంతటితో ఇక స్వస్తి పలకాలనే ఉద్దేశ్యంతో మోడీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, ‘ఒక ఆవును చంపడమంటే.. ఒక హిందూ బాలికను అత్యాచారం చేయడం లేదా ఓ హిందు గుడిని నాశనం చేయడం లాంటిద'ని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి జిష్ణు బాసు బంగ్లా సరిహద్దు దేశమైన పశ్చిమ బెంగాల్‌లోనే వ్యాఖ్యనించారు.

కాగా, ఇటీవల కాలంలో బీఎస్ఎఫ్ సిబ్బంది ఆవులను, స్మగ్లర్లను అదుపులోకి తీసుకోవడంతో బంగ్లాదేశ్‌లో ఆవు మాంసం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

English summary
Some 30,000 Indian soldiers guarding the border with Bangladesh have a new mandate under Prime Minister Narendra Modi's government this year — stop cattle from crossing illegally into the Muslim-majority neighbour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X