వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహితుడి హత్యకేసు: ఎన్నారై విద్యార్ధికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్నేహితుడి హత్యకేసులో 25 ఏళ్ల భారతీయ అమెరికన్ ఇంజనీరింగ్ విద్యార్ధికి జీవిత ఖైదు విధిస్తూ అమెరికన్ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే, రాహుల్ గుప్తా జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు.

జార్జిటౌన్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుతున్న మార్క్ వా (24), రాహుల్ గుప్తా ఇద్దరూ బాల్య స్నేహితులు. మార్క్ వాతో తన గర్ల్ ప్రెండ్ చాటింగ్ చేయడం తట్టుకోలేకపోయిన రాహుల్ గుప్తా, గర్ల్ ప్రెండ్ మోసం చేసిందని భావించాడు.

Indian-American Student Sentenced to Life for Killing Friend

ఈ నేపథ్యంలో అక్టోబర్ 13, 2013న వాషింగ్టన్‌లోని సబ్అర్బ్ ప్రాంతంలో ఉన్న సిల్వర్ స్ప్రింగ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోన్న మార్క్ వాపై దాడి చేసి 11 సార్లు కత్తితో పొడిచాడు. ఈ దాడిలో మార్క్ వా అక్కడికక్కడే మరణించాడు.

దీంతో రాహుల్‌ని అరెస్టు పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణలో భాగంగా తన గర్ల్ ప్రెండ్, స్నేహితుడు ఇద్దరు మోసం చేశారని, అందుకే తన స్నేహితుడుని చంపేశానని రాహుల్ తెలిపిననట్లు పోలీసులు వివరించారు.

ఈ హత్య కేసులో రాహుల్‌ని నిందితుడుగా భావించి అమెరికన్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది.

English summary
A 25-year-old Indian-American engineering student has been sentenced to life in prison by a US court for fatally stabbing his friend after allegedly finding him cheating with his girlfriend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X