వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎస్ తొలి అధ్యక్షురాలు భారత సంతతి మహిళే కావొచ్చు!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసి ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై ఘన విజయం సాధించారు డొనాల్డ్ ట్రంప్‌. కాగా, ట్రంప్ గెలిచిన తర్వాత తాను అమెరికన్లందరికీ అధ్యక్షుడినని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 'ట్రంప్ మాకు అధ్యక్షుడు కాదు' అంటూ ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలకు భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌, సెనేటర్‌గా గెలుపొందిన కమలాహారిస్‌ అండగా నిలిచి, వారితో కలిసి పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమలాహారిస్‌ గురించి అమెరికా మీడియా ఆసక్తికరంగా ప్రచురించింది. అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు కమలాహారిస్‌ కావొచ్చేమో అంటూ అక్కడి ఓ మీడియా పేర్కొంది.

మోక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం ఈ కథనం రావడం విశేషం. 51ఏళ్ల కమలా హారిస్‌ తల్లి తమిళనాడులోని చెన్నైకి చెందిన వారు కాగా, ఆమె తండ్రి జమైకాకు చెందిన వారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె కాలిఫోర్నియా నుంచి యూఎస్‌ సెనేట్‌కు ఎంపికయ్యారు. దీంతో ఆమె యూఎస్‌ సెనేట్‌కు ఎంపికైన తొలి బ్లాక్‌, ఏషియన్‌ సెనేటర్‌గా గుర్తింపు సాధించారు.

Indian-origin Kamala Harris has potential to be first woman US Prez: Report

వలస విధానాలపై అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను కమలాహారిస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా ట్రంప్‌ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రచారం కూడా ప్రారంభించారు. 'ట్రంపిజం'ను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె వెల్లడించిన మరుసటి రోజే హాఫింగ్టన్‌ పోస్ట్‌ ఆమెపై కథనం ప్రచురించింది.

అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలు కాగలిగే సామర్థ్యం ఉన్న మహిళ అని పత్రిక పేర్కొంది. ఇప్పటికే సెనేటర్‌గా గెలిచి రికార్డు సృష్టించారని, ఆమెకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా, డెమోక్రట్‌ పార్టీలో నేతగా మంచి ట్రాక్‌ రికార్డు ఉందని తెలిపింది.

అంతేగాకుండా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను దిగిపోబోయే ఒబామా, జోయ్‌ బిడెన్‌ల మద్దతు కూడా ఉందని వెల్లడించింది. ఇది హారిస్‌కు తన ప్రొఫైల్‌ మరింత మెరుగు పరుచుకునేందుకు బాగా సహాయపడుతుందని, 2020లో అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ పడే అవకాశముందని హఫ్ఫింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో స్పష్టం చేసింది.

English summary
Indian-origin California Attorney General Kamala Harris has potential to become the first woman president of the United States, a media report has said, days after Hillary Clinton was unable to break the highest glass ceiling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X