వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు షాక్: గ్వామ్ ద్వీపంపై దాడికి ఉత్తర కొరియా రె'ఢీ'

By Narsimha
|
Google Oneindia TeluguNews

ప్యాంగ్‌యాంగ్‌: గ్వామ్ ద్వీపాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు ఉత్తరకొరియా నియంత కిమ్‌జాంగ్‌ఉన్ ప్రణాళికను సిద్దం చేసినట్టు సమాచారం. అమెరికాకు చెందిన గ్వామ్ ద్వీపంపై అణుదాడి చేస్తామని, ఈ మేరకు ప్రణాళికను కూడ సిద్దం చేశామని కిమ్ ఇప్పటికే ప్రకటించారు.

అమెరికా, ఉత్తరకొరియాల మధ్య మాటల తూటాలు పేలిన తర్వాత ఫసిఫిక్ సముద్ర జలాల్లో ఉన్న అమెరికాకు చెందిన గ్వామ్ ద్వీపంపై అణుదాడి చేస్తామని కిమ్ ప్రకటించారు.

గ్వామ్‌పై దాడికి కిబ్ నేతృత్వంలోని కీలక అధికారులు సమావేశమైన యుద్దగది చిత్రాలను ఆ దేశ మీడియా విడుదల చేసింది. గ్వామ్ ద్వీపానికి చెందిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను కిమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కొరియా, జపాన్ దేశాల సముద్ర జలాల్లో ఉన్న అమెరికా బేస్‌లకు చెందిన చిత్రాలు కూడ ఉన్నాయి.

Inside Kim Jong-un's 'war room': Chubby dictator studies Guam missile strike plan with key lieutenants and chilling satellite images

కిమ్‌కు సహకరిస్తున్న వారిలో ఉత్తర కొరియా రాకెట్ పితామహూడు కిమ్ జాంగ్ సిక్ కూడ ఉన్నారు. ఉత్తర కొరియా అణుశక్తి కలిగిన క్షిపణులను తయారు చేయడంలో ఆయనదే కీలకపాత్ర.
ఉత్తరకొరియాకు తూర్పున ఉన్న ఓ నావల్‌ బేస్ నుండి జపాన్ మీదుగా గ్వామ్‌పై దాడి చేసేందుకు కిమ్ వ్యూహం రచించారిన దక్షిణ కొరియాకు చెందిన మిటరీ అధికారి ప్రకటించారు.

నాలుగు మధ్యతరహ శ్రేణి క్షిపణులను గ్వామ్ మీద ప్రయోగిస్తోందని చెప్పారు. ఇవి 17 నిమిషాల పాటు 3,356 కి.మీ. ప్రయాణించి గ్వామ్ దీపానికి 40 కి.మీ. దూరంలో సముద్ర జలాలను ఢీకొంటాయని ఆయన వివరించారు.

English summary
With concentration etched on his face, Kim Jong-un looks at North Korean plans to launch a missile attack on the US island of Guam.The newly-released photographs give a revealing insight into the chubby despot's 'war room' and the key military people behind him who will support any decision to attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X