వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు షాక్ కాదా?: చైనా కార్నర్, పాక్‌పై ట్రంప్ ప్రశంసల వెనుక..!

అమెరికా తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు షాకిచ్చారు. పాకిస్తాన్ పైన అవ్యాజమైన ప్రేమ కురిపించాడు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు షాకిచ్చారు. పాకిస్తాన్ పైన అవ్యాజమైన ప్రేమ కురిపించాడు. ఎన్నికల ప్రచార సమయంలో, అంతకుముందు పాక్ పైన ధ్వజమెత్తిన ట్రంప్, తాజాగా ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ప్రశంసలు కురిపిస్తూ ఫోన్ చేశారని పాక్ పీఎంవో చెప్పింది.

అయితే, పాక్ పైన ట్రంప్ ప్రశంసలు వ్యూహాత్మకం కావొచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ - చైనా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. చైనాను అమెరికా లేదా ట్రంప్ మొదటి నుంచి శత్రువుగా చూస్తున్నాయి.

భారత్‌కు ఆందోళన: పాక్ షరీఫ్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

ఈ నేపథ్యంలో చైనాను మరింత ఒంటరిని చేసే ఉద్దేశ్యంలో భాగంగా, పాక్‌ను ఆ దేశానికి దూరం చేసేందుకు ఇలా ప్రశంసించి ఉంటారని భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా చైనా, పాక్ దగ్గరవుతున్నాయి.

అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చైనా పైన ఆయనకు ప్రేమ లేదని అర్థమవుతోందని అంటున్నారు. అదే చైనాకు దగ్గరవుతున్న పాక్‌ను ఆ దేశానికి దూరం చేయడమే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. చైనాకు దూరం చేసి, తమకు దగ్గర చేసుకోవాలని ట్రంప్ లేదా అమెరికా భావిస్తున్నాయని అంటున్నారు.

అయితే, పాక్ ప్రధానికి ట్రంప్ ఫోన్ చేయలేదని ట్రంప్ బృందం వివరణ ఇచ్చింది. అయితే, వివరణ ఇచ్చే వరకు ట్రంప్ వ్యాఖ్యలు వ్యూహాత్మకమే కావొచ్చునని అభిప్రాయపడ్డారు.

వ్యూహమే కావొచ్చు

వ్యూహమే కావొచ్చు

పాకిస్తాన్ పైన, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పైన ట్రంప్ ప్రశంసలు వ్యూహమే కావొచ్చునని కొందరు భారత అధికారులు భావిస్తున్నారు. అసలు ట్రంప్ ఫోన్ కాల్ ఎవరూ చూడలేదని, అలాగని కొట్టి పారేయడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అధికారులు అన్నింటిని పరిశీలిస్తున్నారు. అయితే, ట్రంప్ కార్యాలయం నుంచి పాక్‌కు ప్రశంసలు అందించినట్లుగా అధికారిక సమాచారం వస్తే మాట్లాడవచ్చునని చెబుతున్నారు.

పాక్‍‌కు ప్రశంస

పాక్‍‌కు ప్రశంస

కాగా, ట్రంప్.. నవాజ్ షరీఫ్‌తో ఫోన్లో సంభాషించినట్లు పాక్ పీఎంవో అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. పాక్‌ ఎదుర్కొంటున్న అసాధారణ సమస్యల పరిష్కారంలో ఎటువంటి పాత్ర నిర్వహించడానికైనా సిద్ధంగా ఉన్నానని, అలా చేయడాన్ని గౌరవంగా భావిస్తానని, అంతేకాకుండా వ్యక్తిగతంగా చేస్తానని, ఏ సమయంలోనైనా నాకు మీరు ఫోన్‌ చేసి మాట్లాడవచ్చునని, అధికారికంగా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే జనవరి 20వ తేదీ ముందైనా సరే మాట్లాడవచ్చునని ట్రంప్‌.. షరీఫ్‌తో చెప్పినట్లు పాక్‌ పీఎంవో పేర్కొంది.

అసలు చెప్పలేదు

అసలు చెప్పలేదు

అయితే, ఆయన ప్రస్తావించిన అసాధారణ సమస్యలేమిటో ఎవరూ వెల్లడించలేదు. షరీఫ్‌కు చాలా మంచి పేరుందని, ఆయన అద్భుతమైన వ్యక్తి అని, చాలా బాగా పని చేస్తారని ట్రంప్‌ కితాబిచ్చారని పేర్కొంది. షరీఫ్‌తో సమావేశమయ్యేందుకు ఎదురు చూస్తున్నానని ట్రంప్‌ అన్నారని పేర్కొంది.

ఆహ్వానం

ఆహ్వానం

ఈ సందర్భంగా ట్రంప్‌ను పాకిస్థాన్‌ రావాల్సిందిగా షరీఫ్‌ ఆహ్వానించారు. పాక్‌ అద్భుతమైన దేశమని, అక్కడి ప్రజలు చాలా తెలివైనవారని ట్రంప్ ప్రశంసించినట్లుగా తెలిపారు.

ట్రంప్ నాడు ఏమన్నారు?

ట్రంప్ నాడు ఏమన్నారు?

ఎన్నికల ప్రచార సమయంలో, అంతకుముందు కూడా ట్రంప్ పాకిస్తాన్ పైన విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్ నెలలో అమెరికా రేడియో కార్యక్రమంలో ట్రంప్‌ పాకిస్తాన్ గురించి మాట్లాడారు. ప్రపంచంలోనే పాక్‌ చాలా ప్రమాదకరమైన దేశమని, భారత్‌ ఒక్కటే దానికి సమాధానం చెప్పగలదని, పాక్‌ని అదుపులో ఉంచాలంటే గట్టి సైన్యం ఉన్న భారత్‌ ద్వారానే ప్రయత్నించాలని ట్రంప్‌ ఆనాడు చెప్పారు.

అంతకుముందు, 2012లో ట్వీట్ చేశారు. పాకిస్తాన్ తమకు స్నేహపూర్వక దేశం కాదని, పాక్‌కు తాము బిలియన్ల కొద్ది డాలర్లు ఇస్తున్నామని, వాటిని ఏం చేస్తుందని ప్రశ్నించారు. మరోసారి, బిన్ లాడెన్‌ను ఆరేళ్ల పాటు కాపాడినందుకు పాక్ అమెరికాకు ఎప్పుడు క్షమాపణ చెబుతోందని అడిగారు.

English summary
At the start of the US election campaign, a senior analyst had said that President Trump and candidate Trump would be two entirely different people. His rhetoric was what was much spoken about and this may have won him the elections ultimately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X