వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్ కిరాతకం: సొంత ఫైటర్లనే చంపేస్తున్నారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

కైరో: బందీలను దారుణంగా హత్య చేసే ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) తన సహచరుల పట్ల కూడా అంతే క్రూరంగా ప్రవర్తిస్తోందని వెల్లడైంది. అమెరికా తదితర దేశాల దాడుల కారణంగా భారీ ఎత్తున భూభాగాల్ని కోల్పోయిన ఐసిస్ తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉందని, ఈ నేపథ్యంలో గాయాలపాలైన తన సహచరుల అవయవాలను తొలగించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తోందట.

దాడులలో గాయాలపాలైన ఐసిస్ ఉగ్రవాదులను చంపి వారి శరీరం నుంచి గుండె, మూత్రపిండాల వంటి కీలకమైన అవయవాలను ఐసిస్ తొలగిస్తోందని, ఈ పని కోసం వైద్యులను బలవంతంగా ఒప్పిస్తోందని అరబ్‌ పత్రిక ఒకటి వెల్లడించింది.

అప్పటిదాకా నిద్రపోం: భారత్‌కు ఐసిస్ హెచ్చరికఅప్పటిదాకా నిద్రపోం: భారత్‌కు ఐసిస్ హెచ్చరిక

ఇరాక్‌లోని మోసుల్‌ పట్టణం దక్షిణభూభాగాన్ని కోల్పోవటంతో ఆదాయపరంగా ఆ సంస్థ ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, ఈ నేపథ్యంలో సహచరుల అవయవాలను అంతర్జాతీయ నల్లబజారులో అమ్ముతోందని ఆ పత్రిక పేర్కొంది.

ISIS has started killing own fighters: Here is why

తమ ఆధీనంలోని జైళ్లలో ఉన్న ఖైదీలను రక్తందానం చేయాల్సిందిగా ఐసిస్ నిర్బంధిస్తోందని, మరణశిక్ష పడినవారిపై శిక్షను అమలు చేయకుండా వాయిదా వేస్తూ వారి నుంచి వీలైనంత రక్తాన్ని తీసుకుంటోందని తెలిపింది. అవయవాలను తొలగించిన 183 మృతదేహాలను మోసుల్‌లోని ఒక ఆసుపత్రిలో చూసినట్లుగా కొందరు ప్రత్యక్షసాక్షులు పేర్కొన్న విషయాన్ని వెల్లడించింది.

ఆరెస్సెస్‌ను ఐసిస్‌తో పోల్చిన ఆజాద్, దుమారంఆరెస్సెస్‌ను ఐసిస్‌తో పోల్చిన ఆజాద్, దుమారం

పోరాటంలో గాయపడిన ఉగ్రవాదులను హతమార్చి, వారి అవయవాలను తీసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని పలు వార్తా సంస్థలు కూడా వెల్లడించాయి. గాయపడిన ఉగ్రవాది అవయవాలను తీయాలని ఉగ్రవాదులు డాక్టర్లను బెదిరిస్తున్నారని చెబుతున్నారు.

English summary
Cash-strapped Islamic State terror group has been killing its injured fighters so that their organs can be extracted and sold on the black market abroad, according to media reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X