వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్ షాకింగ్ వీడియో: బందీలను పేల్చేసిన బాలుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: కారులో బందీలుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను ఓ నాలుగేళ్ల బ్రిటిష్‌ బాలుడు డిటోనేటర్‌తో పేల్చి చంపిన వీడియోను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐసిస్) తాజాగా విడుదల చేసింది. ఐసిస్ వస్త్రధారణలో చేతిలో డిటోనేటర్‌ పట్టుకొని బాలుడు కనిపించాడు.

అతడి పక్కనే నిల్చున్న ఓ ముష్కరుడు... బందీలుగా ఉన్న వ్యక్తులను గూఢచారులుగా తన సందేశంలో పేర్కొన్నాడు. తమ ముష్కర సోదరులను హతమార్చడానికి పాశ్చాత్య దేశాలకు వారు సాయం అందించారని ఆరోపించాడు.

ISIS makes 4 year old execute prisoners

అందుకు ప్రతీకారంగానే వారిని చంపేస్తున్నట్లు చెప్పాడు. ఐసిస్‌తో యుద్ధానికి సిద్ధం కావాలని బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ను ఉద్దేశించి హెచ్చరిక జారీ చేశాడు. అనంతరం బాలుడు డిటోనేటర్‌తో కారును పేల్చివేశాడు. ఇస్లాంను స్వీకరించి, సిరియాకు వెళ్లిపోయిన గ్రేస్‌ డేర్‌ అనే బ్రిటన్‌ మహిళ కుమారుడు ఇసా డేర్‌గా సదరు బాలుణ్ని గుర్తించారు.

English summary
ISIS makes 4 year old execute prisoners
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X