వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇస్లామిక్ స్టేట్: స్త్రీలు సహా.. ఎత్తుకెళ్తున్నారు, పారిపోతున్న క్రిష్టియన్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీరుట్: ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐసిస్) తీవ్రవాదులు సిరియాలో రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కొద్ది రోజుల సమయంలో 220 మంది క్రిస్టియన్లను వారు అఫహరించారు. నిత్యం క్రిస్టియన్లను అపహరిస్తున్న నేపథ్యంలో సిరియాలో వేలాదిమంది క్రిస్టియన్లు తమ ఇళ్లు, గ్రామాలు వదిలి పారిపోతున్నారు.

గత మూడు రోజులుగా 11 గ్రామాలలోని 220 అస్సిరియన్ సిటిజన్లను అఫహరించారని సిరియా ఆబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తెలిపింది. వారిని హాసాకే ప్రావిన్స్ నుండి ఎత్తుకెళ్లారు. వారి విడుదల కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు.

Islamic State in Syria has abducted 220 from Christian villages this week

ఐసిస్ ఉగ్రవాదులు అపహరించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు, వృద్ధులే కావడం గమనార్హం. 220 మంది క్రిస్టియన్ల అపహరణ పైన అమెరికా తీవ్రంగా స్పందించింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

21ని ఐస్‌గా భావించిన పోలీసులు...

ఓ జంట తమ కుటుంబంలోని ఒకరి ఇరవయ్యొక్కటవ పుట్టిన రోజు కోసం 21 అంకెను వేసింది. అపార్టుమెంటులో పుట్టిన రోజు సందర్భంగా 21 అనే సంఖ్యను వేశారు. అయితే, ఇది రివర్స్‌లో బయట నుండి 'ఐఎస్'గా కనిపించింది. దీంతో స్వీడన్ పోలీసులు పొరపాటున అది ఐఎస్‌గా భావించారు. దీనిని ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారులు పెట్టి ఉంటారని భావించారు. అనంతరం అసలు విషయం తెలిసిందే.

English summary
Islamic State in Syria has abducted 220 from Christian villages this week
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X