ఒబామాకు జాబ్ ఆఫర్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఇప్పటికే ఓ జాబ్ ఆఫర్ వచ్చేసింది.

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అగ్రరాజ్యానికి ఎనిమిదేళ్ళు అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా మరో పది రోజుల్లో ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. అయితే పదవీ విరమణ తర్వాత ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఆయనకు ఇప్పటికే ఓ జాబ్ ఆఫర్ వచ్చేసింది.

ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ సర్వీస్ 'స్పాటిఫై' ఒబామాకు జాబ్ ఇస్తామని ప్రకటించింది. ఆ సంస్థ సీఈఓ డేనియల్ ఏక్ తన ట్వీట్ లో ఈ ఆఫర్ ప్రకటించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ప్లే లిస్ట్స్ అనే హోదా కలిగిన ఉద్యోగం ఇది.

 Job Offer for Obama

ఈ ఉద్యోగం కోసం అగ్రరాజ్యాన్ని కనీసం ఎనిమిదేళ్ళు పాలించిన అనుభవం ఉన్న వ్యక్తి కోసం చూస్తున్నామని సరదాగా ఓ యాడ్ రూపొందించారు. అభ్యర్థి నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచిన వారై ఉండాలన్న నిబంధన కూడా ఉంది. 2009లో ఒబామాకు శాంతి బహుమతి వచ్చిన విషయం తెలిసిందే.

ప్ర‌ముఖ కళాకారులు తెలిసిన వ్య‌క్తి అయితే మంచిదని ప్ర‌క‌టించింది.ప్లేలిస్ట్స్ గురించి ప్రెస్‌మీట్ల‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడే వ్య‌క్తి కావాలి అని ఆ యాడ్‌లో తెలిపింది.

ప్రపంచ అత్యుత్తమ వక్తల్లో ఒకరుగా ఉండాలని ఒబామాను పరోక్షంగా ప్రశంసించింది. ఇదిలా ఉండగా, యాడ్ చివ‌ర్లో తాను స్పాటిఫైలో జాబ్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని ఇటీవల ఒబామా ఇన్‌స్టాగ్రాంలో చేసిన పోస్ట్ కూడా ఉంది.

English summary
Job Offer for Obama
Please Wait while comments are loading...