వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎన్ బాడీ, ఎన్‌ఎస్‌జీలోకి ఇండియా రావాల్సిందే.. బైడెన్ మద్దతు

|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి హామీనిచ్చింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టంచేశారు. అలాగే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు నుంచి కూడా ఆయన ప్రస్తావించారు. భారత్ శక్తిమంత దేశంగా రూపాంతరం చెందుతుందని బైడెన్ ప్రస్తావించారు. అలాగే శాశ్వత సభ్య దేశం కోసం మద్దతు ఇస్తామని తెలిపారు. అమెరికా సపోర్ట్ చేయడం భారత్‌కు కలసివచ్చిన అంశంగా మారింది. అమెరికా ప్రకటనతో మిగతా కీలక దేశాలు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేశారు. భారత్‌కు మెంబర్ షిప్ కోసం జూన్ నెలలో ఇంటర్ గవర్నమెంటల్ నెగిసియేషన్స్ డిస్కషన్స్ జరిగాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సంస్కరణలు చేయాలని జీ4 దేశాలు బ్రెజిల్, జర్మనీ, ఇండియా, జపాన్ కోరాయి. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో 5 శాశ్వత సభ్య దేశాలు.. 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి. ఇవీ రెండేళ్లకోసారి ఎన్నిక నిర్వహించి మరీ మారుస్తుంటారు.

Joe Biden Reiterates US Support For Indias Entry In Top UN Body, Nuclear Group NSG

రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఇవీ తమకు గల ఉన్న పవర్ విటో ఉపయోగించి.. ఏదేని తీర్మానం నిలిపివేస్తాయి. ఇండియా ఎన్ఎస్‌జీలో కూడా రావాలని బైడెన్ కోరారు. నాన్ ప్రొలిఫెరేషన్ ట్రీటికి సభ్య దేశాలు సంతకం చేయాల్సి ఉంటుంది. దీనికి పాకిస్తాన్, ఇండియా ఇంకా సంతకం చేయలేదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు బుధవారం బయల్దేరి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. కోవిడ్‌ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్‌ సదస్సులో దృష్టి పెడతామని అంతకుముందు మీడియాతో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.

ఈ నెల 25వ తేదీ వరకు మోడీ అమెరికా పర్యటన కొనసాగనుంది. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు. ప్రధాని మోడీ రెండోసారి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు అమెరికా పర్యటన చేపట్టారు.

English summary
Joe Biden has reiterated America's support for India's permanent membership on a reformed United Nations Security Council and its entry into the Nuclear Suppliers Group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X