వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిణామాలు.. ట్రంప్‌కు షాక్: అమెరికాలో తెలుగు వ్యక్తి మృతిపై జేకే రోలింగ్

కన్సాస్ కాల్పుల ఘటన పైన ప్రముఖ నవలా రచయిత జేకే రోలింగ్ స్పందించారు. జాతి విద్వేష మాటలకు పరిణామాలు ఉంటాయని, తమాషా కాదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి అన్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/హైదరాబాద్: కన్సాస్ కాల్పుల ఘటన పైన ప్రముఖ నవలా రచయిత జేకే రోలింగ్ స్పందించారు. జాతి విద్వేష మాటలకు పరిణామాలు ఉంటాయని, తమాషా కాదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి అన్నారు.

తద్వారా ట్రంప్‌ను విమర్శిస్తున్న వారి జాబితాలో జేకే రోలింగ్ కూడా చేరారు. కాన్సాక్ కాల్పుల్లో శ్రీనివాస్‌ కూచిభొట్ల హత్యపై రచయిత ఆనంద్‌ గిరిధర్‌ దాస్‌ చేసిన ట్వీట్‌పై జేకే రోలింగ్ స్పందించారు.

<strong>టెక్కీ మృతి: తెలుగు మాట్లాడొద్దు, వాదనకు దిగొద్దు.. ఇలా చేయండి</strong>టెక్కీ మృతి: తెలుగు మాట్లాడొద్దు, వాదనకు దిగొద్దు.. ఇలా చేయండి

ఆమె దీనిపై రీట్వీట్ చేశారు. 'జాతి విద్వేష మాటలకు పరిణామాలు ఉంటాయి.. తమాషా కాదు..' అని పేర్కొన్నారు. కాగా, శ్రీనివాస్‌ హంతకుడు తాను మధ్యప్రాశ్చ్యానికి చెందిన ఇద్దరు వ్యక్తులను చంపినట్లు చెప్పటంతో ఇది ట్రంప్‌ వైపు వేలెత్తి చూపిస్తున్నట్లయింది.

Kansas shooting: 'Language has consequences', says J K Rowling to Trump

అంతకుముందు వైట్ హౌస్ ప్రతినిధి సియాన్‌ స్పైసర్‌ మాట్లాడుతూ.. కేన్సస్‌ హత్యకు ట్రంప్‌ విధానాలకు సంబంధం లేదని చెప్పారు. దీనికి ట్రంప్‌ విధానాలతో సంబంధం ఉందనుకోవడం తొందరపాటు చర్య అవుతుందన్నారు.

<strong>శ్రీనివాస్ భార్య సహా ప్రశ్న: 'ట్రంప్ వ్యాఖ్యలకేం సంబంధం, ఇంతకుమించి మాట్లాడను'</strong>శ్రీనివాస్ భార్య సహా ప్రశ్న: 'ట్రంప్ వ్యాఖ్యలకేం సంబంధం, ఇంతకుమించి మాట్లాడను'

వ్యతిరేకత తప్పు: గుటెరెస్‌

విదేశీయుల పట్ల విపరీతమైన వ్యతిరేకత, ముస్లింల పట్ల భయం, వ్యతిరేకతతో ఉండడాన్ని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ తీవ్రంగా తప్పుపట్టారని ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజార్రిక్‌ తెలిపారు.

అమెరికాలోని కన్సాస్‌లో తెలుగు ఇంజనీర్‌ను కాల్చి చంపిన నేపథ్యంలో స్టీఫెన్‌ స్పందించారు. కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు. గత కొన్ని నెలలుగా ఆంటోనియో ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న జాత్యహంకార నేరాలను తీవ్రంగా ఖండిస్తున్నారని, విదేశయుల పట్ల, ముస్లింల పట్ల విపరీతమైన వ్యతిరేకత చూపడం తప్పని చెప్తూనే ఉన్నారని స్టీఫెన్‌ తెలిపారు.

English summary
JK Rowling has never been one to mince words, especially when it comes to Donald Trump, and with the Kansas shooting grabbing eyeballs across the globe with an Indian engineer shot to death by a white man which is being touted as a hate crime, the legendary author has once again lashed out at the United States President over the tragic development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X