వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు మహిళల విషప్రయోగం.. కిమ్ సోదరుడు 20 నిమిషాల్లోనే మృతి

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ చాలా వేగంగా ప్రాణాలు కోల్పోయాడని మలేషియా ప్రభుత్వం తెలిపింది. విష ప్రయోగం కారణంగా అతను చనిపోయాడు.

|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ చాలా వేగంగా ప్రాణాలు కోల్పోయాడని మలేషియా ప్రభుత్వం తెలిపింది. విష ప్రయోగం కారణంగా అతను చనిపోయాడు.

విష ప్రయోగం కారణంగా చనిపోయిన కిమ్ జాంగ్ నామ్ సరిగ్గా 15 నుంచి 20 నిమిషాల్లోనే మృత్యువాత పడ్డాడనని మలేషియా ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఈ నెల 13వ తేదీన నామ్ పైన ఇద్దరు మహిళలు విషప్రయోగం చేశారు. దీంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు.

మృతిపై అనుమానాలు

మృతిపై అనుమానాలు

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సవతి సోదరుడైన కిమ్ జోంగ్‌ నామ్‌ ఇటీవల కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో హత్యకు గురయ్యాడు. ఆయన మృతిపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇరవై నిమిషాల్లోనే...

ఇరవై నిమిషాల్లోనే...

ఈ నేపథ్యంలో మలేషియా ఆరోగ్యశాఖ మంత్రి స్పందించారు. నామ్‌పై అధిక మోతాదులో విష ప్రయోగం జరిగిందని, అది జరిగిన పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఆయన మృతిచెందినట్టు వెల్లడించారు.

విషపదార్థాన్ని పూసిన...

విషపదార్థాన్ని పూసిన...

కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో ఆయన ముఖంపై వీఎక్స్‌ విషపదార్థాన్ని పూసిన కేసులో ఇప్పటికే మలేషియా పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు.

శరీరం మొత్తం వ్యాపించాయి

శరీరం మొత్తం వ్యాపించాయి

దీనిపై ఆరోగ్య మంత్రి సుబ్రమణియం శతశివం మాట్లాడుతూ.. అధిక మోతాదులో వీఎక్స్‌ విషాన్ని ప్రయోగించడంతో తొలుత గుండె, ఊపిరితిత్తులు ప్రభావితమయ్యాయనీ, ఆ తర్వాత క్రమేణా శరీరం మొత్తం విషం వ్యాపించడంతో ఆయన మృతి చెందినట్టు తెలిపారు.

English summary
Kim Jong Nam died within 20 minutes, autopsy shows.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X