వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్ లో ఉగ్రదాడి: ఇద్దరి మృతి, 20 మందికి గాయాలు

బ్రిటన్ రాజధాని లండన్ పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు భారత కాలమానం ప్రకారంగా ఆదివారం తెల్లవారుజామున బ్రిడ్జిపై నడుస్తున్న వారిపైకి వ్యాన్ ను నడిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో 10 మందికి

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ రాజధాని లండన్ పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు భారత కాలమానం ప్రకారంగా ఆదివారం తెల్లవారుజామున బ్రిడ్జిపై నడుస్తున్న వారిపైకి వ్యాన్ ను నడిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో 20 మందికి గాయాలయ్యాయి.

ఈ ఘటనతో లండన్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ బ్రిడ్జిని మూసివేశారు.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే అధికారులతో మాట్లాడారు. వ్యాన్ ను వేగంగా పాదచారులపైకి ఉగ్రవాదులు కారు నడిపారు.

terror attack in london

అంతేకాదు కారుదిగి ఓ బాలికను కత్తితో పొడిచినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఇదిలా ఉంటే అల్లా కోసం అంటూ ఓ వ్యక్తి పెద్దగా అరిచినట్టు కూడ స్థానికులు చెప్పారు. ఉగ్రదాడిలో పాలుపంచుకొన్నట్టు అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అయితే లండన్ లో మరో చోట కూడ ఉగ్రదాడి జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు.

నిమిషాల్లోనే ఉగ్రమూక ఆటకట్టు

లండన్‌లో ఉగ్రదాడి ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారు. తమకు సమాచారం అందిన తర్వాత కేవలం ఎనిమిది నిమిషాల్లోనే ముగ్గురు ముష్కరులను తుదముట్టించారు. పోలీసులకు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.08 నిమిషాలకు పోలీసులకు తొలి సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు రాత్రి 10.16కల్లా ముగ్గురు ముష్కరులను కాల్చేశారు. రెండు చోట్ల ఏకకాలంలో జరిగిన దాడిలో ఆరుగురు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

English summary
At least 20 people were taken to hospitals across London after the terrorist attacks on London Bridge and at Borough Market, London Ambulance Service said in a statement. The injured were taken to six hospitals, while other people were treated at the scene, London Ambulance Service Assistant Director of Operations Peter Rhodes said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X