వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూట్‌కేస్‌లో దాక్కొని జంప్అవుదామనుకున్నాడు,కానీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

పెరూ: ఓ వ్యక్తి సూట్‌కేసులో దాక్కొని జంప్ అవుదాముకున్నాడు. అయితే, అనుకోకుండా విమానాశ్రయ సిబ్బందికి దొరికిపోయాడు. ఈ సంఘటన పెరూ రాజధాని లిమాలో జరిగింది. సూట్‌కేసులో తప్పించుకుందామనుకొని అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

జోర్జ్ చావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ వ్యక్తి వచ్చాడు. అతడు టెన్షన్‌గా కనబడుతున్నడు. వేగంగా వెళ్తున్నాడు. అతని టెన్షన్‌ను విమానాశ్రయ భద్రతాధికారులు చూశారు. ఏదో మతలబు ఉందనుకున్నారు. అతడిని తనిఖీ చేసేందుకు ఆపేశారు.

Man found inside suitcase at Peruvian airport

సూట్‌కేసు, అతడు వేసుకున్న బ్యాగును తెరవమని చెప్పారు. కానీ అతడు మాత్రం దానిని తెరవకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. స్పిఫర్ డాగ్ సూట్ కేసు వైపు అదేపనిగా చూస్తోంది. దీంతో, అనుమానం వచ్చిన సిబ్బంది దానిని తెరిచారు.

అందులో ఓ వ్యక్తి కనిపించాడు. దీంతో, అధికారులు అవాక్కయ్యారు. అసలు అతను అలా ఎందుకు వచ్చాడు? ఎందుకు పారిపోవాలనుకున్నాడు? అనే విషయమై ఆరా తీస్తున్నారు. వారి గురించి అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

English summary
Man found curled up in case at Jorge Chavez International Airport in Lima.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X