యువతిపై మూత్రం పోశాడు: పార్టీలో ఊహించని షాక్..

Subscribe to Oneindia Telugu

మెల్‌బోర్న్: ఓ పార్టీలో పాల్గొన్న యువతిపై యువకుడు మూత్రం పోసిన ఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో చోటు చేసుకుంది. గతేడాది ఫిబ్రవరి 26న ఈ ఘటన చోటు చేసుకోగా.. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల తప్పిదంతో ఓ నిర్దోషి కేసులో ఇరికే ప్రమాదం ఏర్పడింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని స్పైడర్‌బైట్‌లో గతేడాది ఫిబ్రవరి 26న ఓ పార్టీ జరిగింది. ఇందులో పాల్గొన్న బెల్లీ నోలన్ అనే యువతిపై గుర్తు తెలియని యువకుడు మూత్రం పోశాడు. చుట్టూ చాలామంది ఉండటం.. పార్టీ మూడ్ లో ఉండటంతో యువతి దాన్ని ఆలస్యంగా గుర్తించింది.

man urinates on woman in a party in melbourne

తొలుత తనపై పడిందని మద్యం అని భావించినప్పటికీ.. ఆ తర్వాత మూత్రం అని గుర్తించినట్లు బెల్లీ నోలన్ తెలిపింది. అనుకోని ఘటనతో తాను షాక్ తిన్నట్లు తెలిపింది. దీంతో ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవి ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. 26ఏళ్ల జోయెల్ మార్రిసన్ ను అరెస్టు చేశారు.

అయితే ఆ చర్యకు పాల్పడింది తాను కాదని జోయెల్ మార్రిసన్ ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం నాడు మెల్ బోర్న్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. విచారణలో జోమెల్ ను నిర్దోషిగా తేల్చారు. నిర్దోషిపై అభియోగాలు మోపి కేసును తప్పుదోవ పట్టించినందుక కోర్టు పోలీసులను గట్టిగానే మందలించింది.

English summary
A 26-year-old man from melbourne was arrested after stalking a woman on party and urinating on her back.
Please Wait while comments are loading...