వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక, భయంలేని సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు మాత్రం ట్రంప్ వ్యాఖ్యలు కలవరం లేదా భయం కలిగించడం లేదట.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: టెక్ కంపెనీలకు అమెరికా తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. అమెరికా వారికి ఉద్యోగాలు ఇవ్వకుంటే బాగుండదని ట్రంప్ కంపెనీలను హెచ్చరిస్తున్నారు. అయితే, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు మాత్రం ట్రంప్ వ్యాఖ్యలు కలవరం లేదా భయం కలిగించడం లేదట.

ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్లను: ఇండియన్ అమెరికన్ ప్రమీలట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్లను: ఇండియన్ అమెరికన్ ప్రమీల

దానికి కూడా కారణం ఉందట. జాబ్ క్రియేటర్‌గా మైక్రోసాఫ్ట్ ఎక్కువ అవకాశాలు అమెరికన్లకే ఇచ్చిందంటున్నారు. ఈ విషయమై ఆయన చాలా విశ్వసనీయంగా ఉన్నారని అంటున్నారు. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

satya nadella

తమ ప్రధానమైన ఉపాధి అవకాశాలు ఎక్కువగా అమెరికాలో ఉన్నాయని డిజిటల్ లైఫ్ డిజైన్ టెక్ కాన్ఫరెన్సు సందర్భంగా సత్య నాదెళ్ల చెప్పారు. అమెరికాలో ఎక్కువ వేతనంతో కూడిన ఉద్యోగాలను తాము విపరీతంగా సృష్టించామన్నారు.

మైక్రోసాఫ్టులో ప్రపంచవ్యాప్తంగా 1,13,000 ఉద్యోగాలు ఉండగా, వారిలో 64వేల మందికి పైగా అమెరికా వారేనని చెప్పారు. వారిలో ఎక్కువగా వాషింగ్టన్ వారు ఉన్నారన్నారు.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మైక్రోసాఫ్ట్ రోడ్ మ్యాప్ ఏమీ మారదన్నారు. అమెరికాకు చెందిన ఈ కంపెనీ దేశానికి ఎంతో బాధ్యతాయుతంగా పని చేస్తుందన్నారు.

ట్రంప్‌ను తక్కువగా అంచనా వేయవద్దు: చివరి ఇంటర్వ్యూలో ఒబామాట్రంప్‌ను తక్కువగా అంచనా వేయవద్దు: చివరి ఇంటర్వ్యూలో ఒబామా

కాగా, ట్రంప్ గెలవగానే టెక్ కంపెనీలు అమెరికన్లను రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించాయి. గత నెల ట్రంప్‌తో భేటీ అయిన 12 టెక్ దిగ్గజ సీఈవోలలో సత్య నాదెళ్ల కూడా ఉన్నారు. ఈ సమావేశంలో అమెరికాలో ఉద్యోగాలు ఎక్కువగా కల్పించాలని, పెట్టుబడులు పెంచాలని ట్రంప్ హితవు పలికారు. ట్రంప్ ప్రధాన ఎన్నికల సూత్రం అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే.

English summary
Microsoft's Satya Nadella not nervous of President-elect Donald Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X