వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కూతురును రేప్ చేయండి: ఓ తల్లి పైశాచికం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ కన్నతల్లతి తన పైశాచికత్వాన్ని చాటుకుంది. పేగు పంచుకు పుట్టిన కన్న కూతురు అని కూడా చూడకుండా దుర్మార్గపు చర్యకు పాల్పడింది. ఇదంతా.. తన కూతురుపై అత్యాచారం చేయండి అంటూ ఆన్‌లైన్ ప్రకటన ఇచ్చిన ఓ దుర్మార్గపు తల్లి గురించి.

అంతటితో ఆగకుండా, చివరకు తన ఆరేళ్ల కూతురుపై అత్యాచారం చేయించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కాగా, కోర్టు ఆమెకు 26 ఏళ్ల జైలు శిక్షను విధించింది.

అమెరికాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. వాషింగ్టన్‌కు చెందిన ఓ 35ఏళ్ల తల్లి.. ‘డబ్బు చెల్లించేవారు ఎవరైనా నా కూతురుని అనుభవించేందుకు రావొచ్చు' అని ఆన్‌లైన్‌లో ప్రకటనలు చేసింది. అంతేగాకుండా, కూతురుపై దారుణంగా అత్యాచారం చేయించి ఫొటోలు, వీడియోలు తీయించింది.

Mum who invited men to RAPE her six-year-old daughter in adverts online faces jail

ఈ విషయం చివరకు పోలీసులకు తెలియడంతో ఆమె నివాసంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పలు దిగ్ర్భాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఎన్నో అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలు, ఆ బాలికపై లైంగిక దాడి జరుగుతుండగా ఆమె పక్కనే ఉండి చూస్తున్నట్లుగా ఉన్న వీడియోలకు సంబంధించిన ఫుటేజీలు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఆ మహిళను జైలుకు తరలించి విచారించగా ఆమె ఇలాంటి దారుణాలకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదని, గతంలో 12 లైంగిక నేరాలకు పాల్పడిందని, చిన్నపిల్లలపై లైంగిక దాడులు చేయించిందని తెలిసింది.

అయితే, కొన్ని ఇబ్బందుల దృష్ట్యా ఈ దారుణాలకు ఒడిగట్టిన ఆమె పేరు మాత్రం బయటకు చెప్పొద్దని కోర్టు ఆదేశించింది. అలా చెప్పడం వల్ల ఆ బాలిక ఎవరో సమాజానికి తెలిసిపోతుందని, చిన్నారి మనుగడకు ఇబ్బంది అవుతుందని కోర్టు అభిప్రాయపడింది.

కాగా, ఆమె భర్తకు కూడా ఇలాంటి నేరాల కింద 27 ఏళ్లపాటు జైలు శిక్ష పడింది. నేరాలకు పాల్పడి తల్లిదండ్రులు జైలుపాలు కాగా, బాధిత బాలిక, ఆమె సోదరుడిని బాలబాలికల సంక్షరణ కేంద్రానికి తరలించారు.

English summary
A depraved mother faces 26 years in jail after placing a series of online adverts inviting men to rape her six-year-old daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X