వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో కొత్త సౌర‌కుటుంబం.. భూమిలాంటి ఏడు గ్రహాలు కూడా

విశ్వంలో మరో అద్భుతాన్ని కనుగొన్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. సుదూర సౌరకుటుంబంలో భూమిని పోలిన ఏడు గ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. ట్రాపిస్ట్ 1 అనే నక్షత్రం చుట్టూ ఈ గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెల్జియం: విశ్వంలో మరో అద్భుతాన్ని కనుగొన్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. సుదూర సౌరకుటుంబంలో భూమిని పోలిన ఏడు గ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. ట్రాపిస్ట్-1 అనే నక్షత్రం చుట్టూ ఈ గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి.

గతంలో ఎప్పుడూ ఖగోళ ఆవిష్కరణల్లో ఇలాంటి అంశాలను గుర్తించలేదన్నారు. భూగ్రహం కాకుండా సౌరకుటుంబంలో ఉన్న ఇతర గ్రహాల్లో గ్రహాంతరజీవులు ఉన్నరా? లేదా? అనే అంశాన్ని అధ్యయనం చేసేందుకు ఈ ఆవిష్కరణ ఉపయోగపడుతుంది.

ఇదో అద్భుతం

ఈ గ్రహ కూటమి సుమారు 39 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అద్భుత ఆవిష్కరణకు సంబంధించిన నివేదికను నేచర్ జర్నల్ లో కూడా ప్రచురించారు. ఒకే నక్షత్రం చుట్టూ టెరస్ట్రియల్ గ్రహాలు భ్రమణం చేస్తున్న తీరును ఖగోళ శాస్త్రవేత్తలు ఒక అద్భుతంగా భావిస్తున్నారు.

NASA Telescope Reveals Largest Batch of Earth-Size, Habitable-Zone Planets Around Single Star

మన సౌరకుటుంబం మాదిరిగానే

కొత్త సౌరకుటుంబం స్వల్ప తేడాతో మన సౌరకుటుంబం తరహాలోనే ఉండవచ్చనేది శాస్త్రవేత్తల అంచనా. ట్రాపిస్ట్ నక్షత్రం ఆ గ్రహాల మధ్యలో ఉందన్నారు. ఇది సూర్యుడిలో పదో వంతు ఉందని వారి అంచనా.

NASA Telescope Reveals Largest Batch of Earth-Size, Habitable-Zone Planets Around Single Star

ఈ నక్షత్రం కూల్ గా ఉన్న కారణంగా, దాని చుట్టూ తిరిగే గ్రహాల్లో వెచ్చని నీరు ఉండొచ్చని భావిస్తున్నారు. భూమి, శుక్రుడు, అంగారక గ్రహాలకు సూర్యుడి నుంచి అందుతున్న వేడి తరహాలోనే ట్రాపిస్ట్ దగ్గర ఉన్న గ్రహాలకు కూడా హీట్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణం వల్ల ఆ గ్రహాలు జీవానికి అనుకూలంగా ఉంటాయనేది వీరి భావన.

మూడు గ్రహాలు నివాసయోగ్యం?

ట్రాపిస్ట్ నక్షత్రం సమీపంలో ఉన్న మూడు గ్రహాలు నివాసయోగ్యంగా ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ గ్రహ ఉపరితలంపై నీటి ఛాయలు కూడా ఉన్నట్లు వారు అనుమానిస్తున్నారు.

జీవం ఆనవాళ్లు కూడా ఉండొచ్చు

అంతేకాదు, నక్షత్రానికి సమీపంగా ఉండడం వల్ల ఈ గ్రహాల్లో ఏదో ఒకదానిపై జీవానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బెల్జియంలోని యూనివర్సటీ ఆఫ్ లీగ్ కు సంబంధించిన ఎక్సోప్లానెట్ పరిశోధకుడు మైఖేల్ గిల్లాన్ తన నివేదికలో ఈ అంశాన్ని వెల్లడించారు.

NASA Telescope Reveals Largest Batch of Earth-Size, Habitable-Zone Planets Around Single Star

విశ్వంపై ఉన్న అవగాహనలను మరింత అధ్యయనం చేసేందుకు ఏడు గ్రహాల ఆవిష్కరణ ఉపయోగపడుతుందని మైఖేల్ గిల్లాన్ పేర్కొన్నారు. ఒకవేళ ఆ గ్రహాలపై నీరు ఉన్నా, లేకున్నా, అధ్యయనంలో ఏది బయటపడినా అది ఆసక్తికరంగానే ఉంటుందని ఆయన తెలిపారు.

English summary
NASA's Spitzer Space Telescope has revealed the first known system of seven Earth-size planets around a single star. Three of these planets are firmly located in the habitable zone, the area around the parent star where a rocky planet is most likely to have liquid water.The discovery sets a new record for greatest number of habitable-zone planets found around a single star outside our solar system. All of these seven planets could have liquid water – key to life as we know it – under the right atmospheric conditions, but the chances are highest with the three in the habitable zone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X