వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ హెచ్చరిక: ఉత్తర కొరియా అణు దాడి చేస్తే.. ఇలా తప్పించుకోవాలి!

క్షిపణి దాడులు జరిగితే ఎలా ఆత్మరక్షణ చేసుకోవాలో జపాన్‌ దేశం తమ పౌరులతో మాక్‌ డ్రిల్‌ చేయించింది. అమెరికా పసిఫిక్‌ ప్రాంతంలోని గ్వామ్‌పై క్షిపణి దాడులు చేస్తామని ఉత్తర కొరియా పదేపదే కవ్విస్తోంది.

|
Google Oneindia TeluguNews

టోక్యో: క్షిపణి దాడులు జరిగితే ఎలా ఆత్మరక్షణ చేసుకోవాలో జపాన్‌ దేశం తమ పౌరులతో మాక్‌ డ్రిల్‌ చేయించింది. అమెరికా పసిఫిక్‌ ప్రాంతంలోని గ్వామ్‌పై క్షిపణి దాడులు చేస్తామని ఉత్తర కొరియా పదేపదే కవ్విస్తోంది.

ఎలా తప్పించుకోవాలో

ఎలా తప్పించుకోవాలో

ఈ నేపథ్యంలో క్షిపణి దాడులు జరిగితే ఎలా తప్పించుకోవాలో సముద్ర తీర కొతోరా పట్టణంలో డ్రిల్‌ చేయించారు. లౌడ్‌ స్పీకర్ల నుంచి ఆదేశాలు ఇవ్వగానే పాఠశాలల్లో సాకర్‌ ఆడుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కోచ్‌ అంతా సురక్షిత ప్రాంతానికి వెళ్లి పది నిమిషాలు దాక్కున్నారు.

ఇలా తప్పించుకోవాలి

ఇలా తప్పించుకోవాలి

కూర్చొని రెండు చేతులతో చెవుల మీదుగా తలను గట్టిగా పట్టుకున్నారు. 18,000 మంది ఉండే ఈ పట్టణంలో చాలా మంది డ్రిల్‌లో పాల్గొన్నారు.

కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరిక

కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరిక

రూపొందించడం వల్ల అమెరికా దాని మిత్రపక్షాలు దక్షిణ కొరియా, జపాన్‌ మండిపడుతున్నాయి. ఇదే అదనుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌ ఉన్‌ అమెరికాపై అణు దాడికి వెనుకాడేది లేదంటున్నాడు. ఆ వ్యాఖ్యలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘాటుగానే బదులిచ్చారు.

ట్రంప్ తీవ్ర హెచ్చరిక

ట్రంప్ తీవ్ర హెచ్చరిక

తమపై, తమ మిత్ర దేశాలపై దాడి జరిగితే ఉత్తర కొరియాను సర్వ నాశనం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే క్షిపణులు, యుద్ధ సామగ్రిని సిద్ధం చేసి పెట్టుకున్నామన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత, ఆందోళన నెలకొన్నాయి.

English summary
Residents of a town on the Japanese coast held evacuation drills on Saturday to prepare for any launch of North Korean missiles toward the U.S. Pacific territory of Guam, that would fly over their homes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X