వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భౌతికశాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

2015 సంవత్సరానికిగానూ భౌతికశాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. తకాకి కజిత (జపాన్), ఆర్థర్ బి.మెక్ డొనాల్డ్ (కెనడా) లకు ఈ పురస్కారం ప్రకటించారు. న్యూట్రినోలు ఎలా పనిచేస్తాయన్న అంశంపై చేసిన పరిశోధనకు గానూ ద రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ పురస్కారం ప్రకటించారు.

 Nobel prize for physics won by Takaaki Kajita and Arthur B McDonald

న్యూట్రినోలపై పరిశోధనకు గాను వారికి ఈ అరుదైన పురస్కారం దక్కింది. తకాకి కజిత జపాన్‌లోని కషివాలో యూనివర్శిటీ ఆఫ్‌ టోక్యోలో పనిచేస్తున్నారు. ఆర్థర్ బి.మెక్ డొనాల్డ్ కింగ్‌స్టన్‌లోని క్వీన్స్‌ యూనివర్శిటీలో పనిచేస్తున్నారు. న్యూట్రినోస్‌కి మాస్‌ ఉంటుందని నిరూపించే న్యూట్రినో ఆసిలేషన్స్‌ వీరిద్దరూ కనుగొన్నారు.

ఇక ఈ ఏడాది తొలి నోబెల్ పురస్కారాన్ని వైద్యరంగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు సోమవారం ప్రకటించారు. ఈరోజు భౌతిక రంగంలో ప్రకటించారు. ఈ వారంలోనే రసాయన, శాంతి రంగాల్లో నోబెల్‌ బహుమతులు ప్రకటిస్తారు. ఆర్థిక విభాగంలో వచ్చే సోమవారం ప్రకటించనున్నారు.

English summary
Nobel prize for physics won by Takaaki Kajita and Arthur B McDonald.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X