ద.కొరియా మరో క్షిపణి ప్రయోగం, అంత సీన్ లేదని అమెరికా

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్యోంగ్‌యాంగ్: ఉత్తర కొరియా మరో మిసైల్ ప్రయోగం చేసింది. దీంతో కొరియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర క్షిపణిని పరీక్షించింది.

దక్షిణ కొరియా అధ్యక్షుడిగా మూన్‌ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ పరీక్షను నిర్వహించింది. కుసాంగ్‌ సమీపంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించారు.

జపాన్ సముద్రంలో కూలింది

జపాన్ సముద్రంలో కూలింది

కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్షిపణి జపాన్‌ సముద్ర జలాల్లో కూలిపోయింది. గత నెలలో నిర్వహించిన రెండు క్షిపణి పరీక్షలు విఫలం కావడంతో నేటి పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.

కొత్త శ్రేణి

కొత్త శ్రేణి

ఇది ఏ రకం క్షిపణి అనేది తెలియాల్సి ఉంది. దీనిపై జపాన్‌ రక్షణ మంత్రి స్పందించారు. ఉత్తర కొరియా తూర్పు తీరానికి 400 కి.మీ. దూరంలో ఈ క్షిపణి కూలిపోయిందని, ఇది కొత్త శ్రేణికి చెందిన క్షిపణి అన్నారు.

ద.కొరియా అధ్యక్షుడిపై ఒత్తిడి పెంచేందుకే.. రెచ్చగొట్టే చర్య

ద.కొరియా అధ్యక్షుడిపై ఒత్తిడి పెంచేందుకే.. రెచ్చగొట్టే చర్య

కాగా, దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిపై ఒత్తిడి పెంచేందుకే ఈ చర్య తీసుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ద కొరియా అధ్యక్షుడు మూన్‌ ఎన్నికల్లో.. ఉ. కొరియాతో సత్సంబంధాలు పెంచుకుంటానని చెప్పారు. అదే మూన్.. ఈ పరీక్షను ఖండించారు.

ఇదో రెచ్చగొట్టే చర్య అని మూన్ అభివర్ణించారు. ఉ. కొరియాతో చర్చలు చేపట్టాలంటే దాని వైఖరిలో కచ్చితంగా మార్పు రావాలన్నారు. ఉ. కొరియా క్షిపణి పరీక్షను అమెరికా పశ్చిమ కమాండ్‌ తేలిగ్గా కొట్టిపారేసింది.

శక్తి లేదని అమెరికా

శక్తి లేదని అమెరికా

ఈ క్షిపణికి తమ భూభాగాన్ని తాకేంత శక్తిలేదని అమెరికా పేర్కొంది. మరో పక్క ఉత్తర కొరియా మిత్ర దేశమైన చైనా ఈ పరీక్షపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

English summary
North Korea launches a new unidentified missile as tensions with US fester.
Please Wait while comments are loading...