నార్త్ కొరియా వద్ద 10 అణుబాంబుల తయారీకి అవసరమైన ప్లూటోనియం

ఉత్తర కొరియా వద్ద పది న్యూక్లియర్ బాంబులకు సరిపోయేంత ప్లూటోనియం ఉందని బుధవారం నాడు దక్షిణ కొరియా ఆరోపించింది.

Subscribe to Oneindia Telugu

సియోల్: ఉత్తర కొరియా వద్ద పది న్యూక్లియర్ బాంబులకు సరిపోయేంత ప్లూటోనియం ఉందని బుధవారం నాడు దక్షిణ కొరియా ఆరోపించింది. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇటీవల ఖండాంతర బాలిస్టిక్ క్షిపిణుల గురించి వ్యాఖ్యానించారు.

ఉత్తర కొరియాకు అంత సీన్ లేదు: 'నైస్' అని చైనాకు ట్రంప్ చురక

ఆయన మాట్లాడిన వారం రోజుల తర్వాత దక్షిణ కొరియా స్పందించింది. ఉత్తర కొరియా వద్ద దాదాపు పది అణ్వాయుధాలు తయారు చేయగలిగేంత ప్లూటోనియం నిల్వలు ఉన్నాయని దక్షిణ కొరియా ఆరోపించింది.

 North Korea has plutonium for 10 nuclear bombs: South Korea

ఉత్తర కొరియా ఇప్పటికే అయిదు అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించింది. 2017 నాటికి అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకే సామర్థ్యం ఉన్న క్షిపణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది.

English summary
North Korea now has enough plutonium to make 10 nuclear bombs, South Korea said Wednesday, a week after leader Kim Jong-Un said it was close to test-launching an intercontinental ballistic missile.
Please Wait while comments are loading...