వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ ధ్వంస రచన?: అమెరికాపై అణుదాడి తప్పదని ఉ.కొరియా సంచలన ప్రకటన

అమెరికాకు చెందిన గువాం దీపం ఉత్తరకొరియాకు 2,218మైళ్ల దూరంలోనే ఉందని, తమ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే దానిపై అణు దాడి తప్పదని సంచలన ప్రకటన చేసింది.

|
Google Oneindia TeluguNews

ప్యోంగ్‌యాంగ్: ఉత్తరకొరియాను అదుపులో ఉండాలంటూ ట్రంప్ హెచ్చరిక చేయడమే ఆలస్యం.. ఆ దేశం నుంచి అమెరికాకు ముప్పు వాటిల్లే సంకేతం వెలువడింది. తొలి నుంచి యుద్దం పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ఉత్తరకొరియా.. ఇక అమెరికాపై అణుబాంబుల వర్షం తప్పదని బాహాటంగానే హెచ్చరిస్తోంది.

ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!

ఈ మేరకు ఉత్తరకొరియా అధికారిక మీడియా కొన్ని వివరాలు వెల్లడించింది. అమెరికాకు చెందిన గువాం దీపం ఉత్తరకొరియాకు 2,218మైళ్ల దూరంలోనే ఉందని, తమ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే దానిపై అణు దాడి తప్పదని సంచలన ప్రకటన చేసింది.

ధ్వంస రచనకు ప్లాన్:

ధ్వంస రచనకు ప్లాన్:

పసిఫిక్ మహాసముద్రంలో గువాం ఒక ద్వీపం. గువాం తీరంలో అమెరికాకు చెందిన సబ్ మెరైన్, స్క్వాడ్రన్, ఒక ఎయిర్ బేస్, కోస్ట్ గార్డ్ గ్రూపులు ఉన్నాయి. వీటన్నింటిని టార్గెట్ చేసిన ఉత్తరకొరియా.. పక్కా వ్యూహంతో వాటిని విధ్వంసం చేస్తామని ప్రకటించింది.

Recommended Video

KIMS MD : Dasari Narayana Rao Health Condition after Jagan Visit - Oneindia Telugu
ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని:

ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని:

గువాంను ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తామని ఉత్తరకొరియా అధికార ప్రతినిధి ప్రకటించడం ఆ దేశ అహంకారపూరిత వైఖరిని స్పష్టం చేస్తోంది. అంతేకాదు, ఒకవేళ గువాంపై దాడికి అడ్డు వస్తే.. అమెరికా ప్రధాన భూభాగంపై కూడా బాంబుల మోత తప్పదని కొరియన్ పీపుల్స్ ఆర్మీ సుప్రీం కమాండర్ ఒకరు హెచ్చరించారు.

అమెరికన్ మార్కెట్లు కుదేలు:

అమెరికన్ మార్కెట్లు కుదేలు:

ఉత్తరకొరియా తాజా ప్రకటన అమెరికా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. యుద్దం దిశగా ఉత్తరకొరియా చేసిన ప్రకటనలు అమెరికాలో శాంతిపూర్వక వాతావరణాన్ని దెబ్బతీసేవిగా మారాయి. ఇది మార్కెట్లకు ఏమాత్రం అనుకూలం కాకపోవడంతో.. ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికన్ మార్కెట్లన్నీ ఒక్కసారిగా కుదేలైనట్లు సమాచారం.

ట్రంప్ వ్యాఖ్యలతో ఉ.కొరియా హెచ్చరిక:

ట్రంప్ వ్యాఖ్యలతో ఉ.కొరియా హెచ్చరిక:

ఉత్తరకొరియా ప్రకటనకు ముందురోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశంపై విరుచుకుపడ్డారు. చీటికీ మాటికీ అమెరికాతో కవ్వింపు చర్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. పదే పదే అమెరికాపై ప్రకటనలు మానుకుంటే మంచిదని హెచ్చరించారు.

అదే సమయంలో ఉత్తరకొరియా వరుసగా జరుపుతున్న ఖండాంతర అణు సామర్థ్య క్షిపణి పరీక్షలను యూఎస్ ఏకగ్రీవంగా ఖండించింది. దీంతో తమ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నారని రగిలిపోయిన ఉత్తరకొరియా.. ఏకంగా అమెరికాకు చెందిన ద్వీపంపై దాడికి సిద్దమంటూ సంచలన ప్రకటన చేసింది.

English summary
North Korea said on Wednesday it is considering plans for a missile strike on the U.S. Pacific territory of Guam, just hours after President Donald Trump told the North that any threat to the United States would be met with "fire and fury".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X